” ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి.. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం..ఇంతటి నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం.. కాలే సిగరెట్, బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి ” అంటూ మనం సినిమా చూసే ముందు కనిపిస్తూ వినపడే మాటలు.. ఇందులో క్యూట్ గా వాళ్ళ నాన్నతో ఒక పాప కనిపిస్తుంది. ఆ పాప కూడా ఒక పెద్ద నటీ. ప్రస్తుతం ఆమె ఎంత అందంగా ఉందో ఓసారి చూడండి..? ఈ ప్రకటనలో ఒక వ్యక్తి తన చిన్న కూతురుతో కలిసి సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు.
ఇలా వారు టీవీ చూస్తున్నప్పుడు తండ్రి దగ్గుతూ ఉండగా పక్కనే ఉన్న కూతురు తన తండ్రి వైపు అమాయకంగా చూస్తూ ఉండడం మనం సినిమా చూసినప్పుడల్లా చూస్తాం. ఆ చిన్న పాప ఒక్క చూపుతో ఆ తండ్రి సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని భావించి అవి మానేస్తాడు. ఆ చిన్న పాప ఇప్పుడు పెద్ద పాప అయిపోయింది. ప్రస్తుతం సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీ జీవితాన్ని గడుపుతోంది.
ఈ చిన్న పాప పేరు “సిమ్రాన్ నటేకర్” ముంబైలోని పుట్టి పెరిగింది. ప్రస్తుతం మోడలింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే సిమ్రాన్ తల్లిదండ్రులు కూడా సినీ పరిశ్రమకు చెందినవారు కావడంతో నో స్మోకింగ్ అనే ప్రకటనలో నటించాల్సి వచ్చింది. ఈ ప్రకటన తర్వాత ఆ పాప 150 పైగా యాడ్స్ లో నటించడం విశేషం. ముంబైలో నో స్మోకింగ్ అవేర్నెస్ యాడ్ కు సంబంధించి ఈ పాప ఫోటోలు ఇప్పటికి కనిపిస్తూ ఉంటాయి. ఈ యాడ్ ద్వారా అందరి మన్ననలు పొందిన ఈ అమ్మాయి ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్లో ఉంది.
అలాగే చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో పూజ పాత్ర చేసింది కూడా ఈ అమ్మాయి. అలాగే ఈ అమ్మడు “జానే కహా సే ఆయు హై” అనే మూవీలో కూడా నటించింది. ఇప్పటికీ తన నటనకు సంబంధించి సరైన గుర్తింపు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు పోతోంది. అంతే కాకుండా చాలా వరకు హిందీ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య కాలంలో సిమ్రాన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది. అప్పుడప్పుడు అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.