మానవ శరీరంలో రక్తం అనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అది మనం శ్వాస తీసుకున్నంతసేపు పంపిణీ చేస్తూనే ఉంటుంది. అలా ప్రసరించే రక్తంలోకి విషం ఎంటర్ అయితే ఏం జరుగుతుంది.. అలాంటప్పుడు మనం ఏం చేయాలి.. ఒకసారి చూద్దాం..?ఒక్కోసారి ప్రమాదవశాత్తు మనల్ని పాము కాటు వేసినప్పుడు దాని విషం మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తప్పనిసరిగా మనకు తెలిసి ఉండాలి. ఏదైనా విషసర్పం కాటు వేసినప్పుడు వ్యక్తి చనిపోయాడు అంటే రెండు రకాలుగా ఉంటుంది. విషసర్పం కాటు వేసినా ఆ సమయంలో శరీరంలోకి ఎంటరైన విషం ఊపిరితిత్తులు, గుండె, మెదడు ద్వారా రక్తంలోకి వెళ్లి వివిధ అవయవాల మీద ప్రభావం చూపడం వల్ల అవి బలహీనపడి మరణం సంభవిస్తుంది. రెండవది అతని పాము కాటు వేసింది అనే భయంతో గుండె ఆగుతుంది. అలాగే పాము కాటు వేసిన వెంటనే ఆ ప్రదేశం నుండి విషం తొందరగా శరీరంలోకి ఎక్కకపోవచ్చు. కాటు వేసిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఆంటీవీనం ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రాణాలు రక్షించవచ్చు. అలాగే పాము కరిచిన ప్రదేశంలో చర్మం కమిలిపోవడం, ఉబ్బడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
#1 ఈ పనులు అస్సలు చేయవద్దు
–కాటు వేసిన ప్రదేశంలో సబ్బునీటితో కడగవద్దు.
–ఆ ప్రదేశాన్ని కత్తితో గాయం చేసి రక్తాన్ని పిండడం చేయవద్దు
–ఎలక్ట్రికల్ షాక్ వంటివి ఇవ్వద్దు.
–అలాగే వేరే వారు నోటితో రక్తాన్ని పీల్చవద్దు
–అలాగే నీరు కానీ ఐస్ కానీ అక్కడ పెట్టకండి
–నొప్పి వస్తే మందులు కానీ ఆల్కహాల్ కానీ తీసుకోరాదు.#2జాగ్రత్తలు
– పాము కరిచిన వెంటనే గుర్తిస్తే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.
–అది ఏ జాతికి చెందిన పామో గుర్తిస్తే మరీ మంచిది.
–ఆందోళనకు గురి కావద్దు.