ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు నటుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో బాగా సుపరిచితుడు. డాన్స్ మాస్టర్ గా స్టార్ హీరోలు సినిమాలకు పనిచేసి తర్వాత హీరోగా మారారు. ఇప్పుడు బిజీయస్ట్ హీరోగా లారెన్స్ ఉన్నారు. ఆయన తల తల్లి పేరు మీద చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా అందరికీ తెలిసిందే.
పేదలకు క్యాన్సర్ గుండె ఆపరేషన్ చేయించి చాలామందికి సహాయం అందించారు. అందుకే లారెన్స్ అంటే మనసున్న మంచి మనిషిగా ఎక్కువ అభిమానిస్తారు.తాజాగా లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పెళ్లి చేసుకునే తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సరిగ్గా పెళ్లి చేసుకుని సౌకర్యం లేని వారికి కల్యాణ మండపం నిర్మిస్తున్నారట.
ఇదే విషయాన్ని స్వయంగా లారెన్స్ తెలిపారు. తన సినిమా విడుదలైన ప్రతిసారి అభిమానుల కోసం ఏదైనా చేయడం తనకి అలవాటట. అందుకే తన అమ్మ పేరు మీద కన్మని కళ్యాణ మండపం నిర్మించాలని నిర్ణయించుకున్నారట. అందులో తన అభిమానులకు ఎలాంటి ఖర్చు లేకుండా పెళ్లి చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి గల కారణం ఏంటంటే తన అభిమాని ఒకరు తన పెళ్లికి ఆహ్వానిస్తూ పత్రిక ఇచ్చారు. అప్పుడు పెళ్లి ఎక్కడ అని అడగగా తన ఇంట్లోనే అని,కళ్యాణ మండపంలో చేసుకుని ఆర్థిక స్తోమత లేదని తెలిపాడు.
పెళ్లి సమయంలో సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి అలా బాధపడుతూ కనిపించడం లారెన్స్ కి నచ్చలేదు. అందుకే అలాంటి వారి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అందుకే తన అమ్మ పేరు మీద కళ్యాణ మండపని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశాడు. కళ్యాణ మండపంలో అన్ని సదుపాయాలు ఉంటాయి. ఎలాంటి డబ్బు చెల్లించకుండా ఉచితంగా సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చని లారెన్స్ తెలిపారుఈ విషయం విని లారెన్స్ అభిమానులతో పాటు అందరూ కూడా లారెన్స్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read:మీకు ఈ హెల్ప్ లైన్స్ సంగతి తెలుసా..? తెలియకపోతే తెలుసుకోండి, చాలా అవసరం!