దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. అలాగే ఇండస్ట్రీలో కూడా మీ టైం నడిచినప్పుడే లైఫ్ ని బాగా చేసుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్లకు మాత్రం సమయం అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇలా అందరికీ ఛాన్స్ ఉండకపోవచ్చు కానీ, కొందరు హీరోయిన్లు ఒక్కసారి ఓ వెలుగు వెలిగి మళ్లీ కనబడకుండా పోతారు. అలాంటి కోవకు చెందిన కథానాయిక సోనాలి జోషి.
ఈమె హీరోయిన్ అంటే ఎవరికీ తెలియదు కూడా.. సుబ్బు సినిమా లో ఎన్టీఆర్ తో సరసన నటించి ప్రేక్షకులకు దగ్గరైన అమ్మడు. సోనాలి తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. ఆమె చేసినటువంటి సుబ్బు, సందడే సందడి, నాన్న నేను అబద్ధం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రాంబాబు గాడి పెళ్ళాం లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరమైపోయింది.
దీనికి తోడుగా అప్పట్లో ఈ అమ్మడు పలు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చిన కారణంగా టాలీవుడ్ సినిమాల ని రిజెక్టు చేసింది. చివరికి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లోనూ ఎక్కడ అవకాశాల్లేక చివరికి నటనకు దూరమైంది. చివరి సమయంలో మలయాళంలో ఒక సినిమా చేసినా సక్సెస్ ఇవ్వలేదు. దీంతో నటి సోనాలి ప్రముఖ ఓటిటి అయిన అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఓ వెబ్ సిరీస్ లో నటించడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆమె సినిమాలకు దూరం అయినా సరే ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానుల దగ్గరగానే ఉంటుంది. కానీ ఈ అమ్మడు ఇప్పుడు గుర్తు పట్టలేకుండా మారిపోయింది.
https://www.instagram.com/p/COrrnEJJNmN/?utm_source=ig_web_button_share_sheet