సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత సెన్సేషనల్ విజయం సాధించిందో తెలిసిందే. ఆలిండియా వైడ్ ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించింది. రజనీకాంత్ మేనరిజన్స్, స్టైల్ అండ్ ఎలివేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని వేరే లెవెల్ లో నిలబెట్టింది. కేవలం అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రజనీకాంత్ ఎలివేషన్స్ కోసమే జైలర్ సినిమాని రెండు మూడు సార్లు చూసిన వారు కూడా ఉన్నారు.
ఈ సినిమాలో పాటలు కూడా ట్రెండింగ్ అయ్యాయి. జైలర్ థీమ్ గాని, హుకుం పాటగాని, కావలయ్య సాంగ్ గాని అటు థియేటర్ లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయ్యాయి. కావాలయ్యాసాంగ్ కోసం తమన్నా చేసిన స్టెప్పులు యువతని విపరీతంగా అలరించాయి.
తమన్నా గ్లామర్ ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలాంటిది కావాలయ్య సాంగ్ లో తమన్నా వేసిన స్టెప్పులు తనకు నచ్చలేదని లియో సినిమా నటుడు ప్రకటించాడు.
అసలు విషయానికి వస్తే తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమన్న వేసిన స్టెప్పులు చాలా దరిద్రంగా ఉన్నాయని అన్నాడు. కావాలా అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదని తెలిపాడు. ఇటువంటి పాటకు సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారో అన్నాడు.
అయితే తాను నటించిన సరకు సినిమాలో సెన్సార్ వాళ్ళు చాలా సన్నివేశాలను కత్తిరించేసారని ఈ సినిమాలో వారికి ఎటువంటి తప్పు కనిపించలేదా అంటూ ప్రశ్నించాడు.మన్సూర్ అలీ ఖాన్ కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమాను ఎంటర్టైన్మెంట్ గా తీసుకోవాలని ప్రతిదాన్ని భూతద్దంలో చూడకూడదని, ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు.
Highly condemn #Leo actor Mansoor Ali Khan's disrespectful speech about actress Tamannaah's #Jailer Kaavaalaa song in yesterday's press meet.
This not the right way to… pic.twitter.com/mrOzPMUfQ1
— Manobala Vijayabalan (@ManobalaV) October 21, 2023
watch video:
Also Read:భగవంత్ కేసరి కలెక్షన్స్ చూశారా…! నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే….