సోనూసూద్..ఆయన సినిమాల్లో మాత్రమే విలన్ బయట ప్రపంచంలో సోనూసూద్ ని మించిన హీరో లేరని చెప్పుకోవచ్చు. కరోనా కల్లోల సమయంలో సోనూసూద్ చేసిన సహాయ కార్యక్రమాలు చాలామంది జీవితాల్లో వెలుగులు నింపాయి. ఆయన ఇప్పటికీ సహాయం అందిస్తూనే ఉన్నారు. రీల్ లైఫ్ లో పెద్ద విలన్ అయిన రియల్ లైఫ్ లో మాత్రం స్టార్ హీరో అనిపించుకుంటున్నారు సోనుసూద్. ఎవరికి ఎక్కడ సహాయం కావాలన్నా, అందించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
అయితే కొందరు మాత్రం సోనూసూద్ కి చాలా కామెడీగా రిక్వెస్ట్ లు పెడుతుండటం.. దానికి సోనుసూద్ ఫన్నీగా బదులు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక వ్యక్తి సోనుసూద్ కి చాలా విచిత్రమైన రిక్వెస్ట్ పెట్టాడట. దానికి సోనుసూద్ కూడా ఫన్నీగానే స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మరి ఇంతకీ ఆ నెటిజన్ ఏమి చేశారో చూద్దామా..? సోదరా.. మీరు ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నారు.. నాకు కూడా ఒక సాయం చేయండి.. నా భార్య నా రక్తం ఎక్కువ తాగుతోంది. దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి.
దయచేసి నాకు ఈ సహాయం చేయండి. భార్య భాదితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను అంటూ నెటిజన్ ట్విట్ లో అడగగా.. దానికి సోనుసూద్ ఫన్నీగా బదులిచ్చారు. అది ప్రతి భార్య జన్మహక్కు అని.. మీరు కూడా నాలాగే అదే రక్తంతో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించండి అని ఫన్నీ ఎమోజి ని షేర్ చేశాడు. దీంతో సోను సూద్ స్పందన చూసి నెటిజన్స్ అంతా భలే సమాధానం ఇచ్చారు సోదరా అంటూ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు.
यह हर बीवी का जन्म सिद्ध अधिकार है भाई,
मेरी मानो उसी खून से एक ब्लड बैंक खोल लो 🤣 https://t.co/bXOPLzDS74— sonu sood (@SonuSood) April 13, 2022