ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా తన బోల్డ్ అందాలను బయట పెట్టేసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ అని చెప్పవచ్చు. ఆమె తన తొలి మూవీలోనే బోల్డ్ గా నటించి ఒక్కరోజులోనే ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో హీరో కార్తికేయకి పర్ఫెక్ట్ జోడిగా నటించి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చి పోయింది అని చెప్పవచ్చు.
వీరిద్దరి కెమిస్ట్రీని చూసిన కుర్రకారు సినిమాను చాలా ఎంజాయ్ చేశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాయల్ పేరు మార్మోగిపోయింది అని చెప్పవచ్చు. అయితే ఈ మూవీతో వచ్చినటువంటి పేరును క్యాష్ చేసుకోవడంలో కాస్త విఫలమైందని చెప్పాలి. ఆమె కథను ఎంచుకోవడంలో దృష్టి పెట్టకపోవడంతో కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి.అయినా పాయల్ కీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా “గాలి నాగేశ్వరరావు” అనే మూవీలో నటిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్ తన అందాలను బయట పెడుతుంది. ప్రస్తుతం ఆమె జీ మహోత్సవం కార్యక్రమంలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. తన ప్రియుడు సౌరబ్ దింగ్రతో కలిసి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. అయితే ఎపిసోడ్ మాత్రం ఈ రోజు ప్రసారం కానుంది. తాజాగా దీని ఫ్రొమో బయటకు విడుదల చేశారు.
ఇందులో సౌరబ్, పాయల్ కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పవచ్చు. అలాగే షో లో మరొక ముందడుగు వేసి పాయల్ అందరికీ షాక్ ఇచ్చింది. స్టేజి పైనే తన ప్రియుడికి ముద్దులిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది. అయితే ఈ షో లో యాంకర్ గా ఉన్నటువంటి శ్రీముఖి వీరిద్దరి కాంబినేషన్ ను చూసి కొద్దిసేపు ఆడుకుంది
పాయల్ మెడలో ఉన్నటువంటి బేబీ అనే నెక్ లెస్ చూసి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయింది అంటూ తను మిమ్మల్ని బేబీ అని పిలుస్తాడు అని అన్నది. దీంతో పాయల్ ముఖంలో సిగ్గు.. కట్ చేస్తే వీరిద్దరూ ప్రస్తుతం ఎఫైర్ లో ఉన్నారు. మరి వీరి పెళ్లి న్యూస్ ఎప్పుడు చెబుతారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.