Cricket: బాటింగ్ లో సచిన్, బౌలింగ్ లో వాల్ష్, కానీ ఫీల్డింగ్ లో రారాజు.. అతని పేరే వినిపిస్తుంది ఎవరంటే ? క్రికెట్ చరిత్రలో బ్యాట్టింగ్ లో విధ్వంసాలు చేసిన వారిని చూసి ఉంటారు, బౌలింగ్ లో విధ్వంసాలు చేసిన వారిని చూసి ఉంటారు, కానీ ఈయన ఫీల్డింగ్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించారు, ఎన్నో అద్భుతమైన రన్ ఔట్లు, క్యాచ్చులు, పట్టారు. ఆయనే జాంటి రోడ్స్. అవును ఆటలో ఒక ప్లేయర్ అద్భుతమైన క్యాచ్, లేదా ఫీల్డింగ్ చేస్తే ఎవరైనా సరే జాంటి రోడ్స్ తో పోల్చాల్సిందే.
క్రికెట్ ప్రేమికులకు జాంటి రోడ్స్ అంటే తెలియని వారు ఉండరు. సౌత్ ఆఫ్రికా లెజెండ్ గా ఎదిగారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు.సౌత్ ఆఫ్రికా తరుపున 52 టెస్టుల్లో 35.66 సగటుతో 2532 పరుగులు చేసారు, 245 వన్డేల్లో 35.11 సగటుతో 5935 పరుగులు చేసారు టెస్టుల్లో 34 క్యాచులు అందుకున్నారు. వన్డేల్లో 105 క్యాచులు అందుకున్నారు. 1992 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన జాంటి రోడ్స్.
దక్షిణాఫ్రికా పాకిస్థాన్ మ్యాచ్ నుంచి జాంటి రోడ్స్ పేరు మారుమోగుతూ వచ్చింది. ఆ మ్యాచ్ లో ఇంజముల్ హాక్ ని రన్ అవుట్ చేసిన తీరు ఇప్పటికి మర్చిపోలేరు క్రికెట్ ప్రేమికులు. జాంటి రోడ్స్ ప్రపంచంలోని ఎన్నో టీమ్స్ కి కోచ్ గా పని చేసారు. ఐపీల్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌కు కోచ్‌గా పని చేసారు. భారత సంప్రాదయాలని ఎంతగానో ఇష్టపడే జాంటి రోడ్స్ తన కూతురికి ‘ఇండియా’ అనే పేరుని పెట్టారు.