Yediyurappa: నాకు ఇప్పుడు అగ్నిపరీక్ష అంటూ భావోద్వేగానికి గురైన యడియూరప్ప ఇవాళ మధ్యాన్నం భోజనం తరువాత తన పదవికి రాజీనామా చేయోతున్నటు సంచలన ప్రకటన చేసారు కర్ణాటక సీఎం యడియూరప్ప. ఈ సందర్బంగా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు యడియూరప్ప. ఈరోజు ఇవాళ బెంగళూరులో పాత్రికేయుల సమావేశం లో ఈ విషయం వెల్లడించారు. ఈ రెండేళ్లు కొరోనాతోనే సరిపోయిందని, తనకు అగ్నిపరీక్ష ఎదురవనుందని తెలిపారు.
అటల్ బిహారి వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు తనని కేంద్ర మంత్రిగా పని చేయాలని కోరినా తాను కర్ణాటక రాజీకీయాల్లోనే కొనసాగినట్టు తెలిపారు. అంతేకాదు అప్పటినుంచి క్రమంగా కర్ణాటకలో బీజేపీ పుంజుకుంటూ వచ్చిందని చెప్పుకొచ్చారు.