Adam Gilchrist squash-ball trick: ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తాజాగా ప్రసిద్ధ ‘స్క్వాష్ బాల్ ఇన్ ది గ్లోవ్’ టెక్నిక్ వెనుక ఉన్న లాజిక్‌ను వివరించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2007 ఫైనల్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ సెంచరీ గురించి, ఆ రోజు అతను తీసిన స్క్వాష్-బాల్ ట్రిక్ గురించి చాలా మంది క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఈ మాజీ అంతర్జాతీయ క్రికెటర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ వ్యాఖ్యాత గా ఉన్నారు.గిల్‌క్రిస్ట్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ మరియు రికార్డ్-బ్రేకింగ్ వికెట్ కీపర్, తన బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్-కీపర్-బ్యాట్స్మెన్లలో ఒకరిగా ఉన్నాడు. అంతేకాకుండా గిల్‌క్రిస్ట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును సృష్టించాడు.
అది ఏప్రిల్ 28, 2007 బ్రిడ్జ్‌టౌన్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో గిల్‌క్రిస్ట్ 104 బంతుల్లో 149 పరుగులు చేసి, ఆస్ట్రేలియాను 281/4కి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ మ్యాచ్ లో శ్రీలంక 215/8తో 53 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ తన ఎడమ చేతిని పైకెత్తి, తన గ్లౌస్ని చూపడం మ్యాచ్ చూస్తున్న వారికి గందరగోళంగా అనిపించింది. అతను దేని గురించి చెప్తున్నాడో ఎవరికి అర్దం కాలేదు. కానీ ఆ తరువాత అతను స్క్వాష్ బంతిని గ్లోవ్లోకి పెట్టుకుని ఆడాడని తెలిసింది.
అయితే తాజాగా గిల్‌క్రిస్ట్ గిల్‌క్రిస్ట్ ICCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్క్వాష్ బాల్ ఇన్ ది గ్లోవ్’ టెక్నిక్ గూర్చి చెప్తూ “నేను పెర్త్‌లోని బ్యాటింగ్ కోచ్ సలహా మేరకు ఈ చిన్న బాల్ ని ఉపయోగిస్తున్నాను. అతను ఈ స్క్వాష్ బాల్‌ను నా అరచేతిలో పెట్టుకుని ఇది గ్లోవ్‌ను ధరించమనీ చెప్పాడు.అంతేకాకుండా చివరి రెండు కానీ మూడు వేళ్ళతో బ్యాట్‌ను ఎక్కువగా పట్టుకోకుండా ప్రయత్నించమని నా కోచ్ చెప్పాడు అని వివరించాడు.