కోల్ కత్తా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన విషయాలను బయటపెట్టారు. కమిటీ ఎంపిక విషయంలో కోచ్ తో పాటుగా, సీఈఓ వెంకీ కూడా పాల్గొంటారని అయ్యర్ నోరు జారడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెళ్ళివెత్తుతున్నాయి. సోమవారం రోజున ముంబై ఇండియన్ జట్టుతో కేకేఆర్ విజయంతో ఆయన మీడియాతో మాట్లాడారు. 11 మంది సభ్యులు ఉండే తుది జట్టులో మీకు చోటు లేదని చెప్పడం ఎంత కష్టంగా ఉంటుందో ఐపీఎల్ మొదలుపెట్టిన టైంలో నేను కూడా అలాంటి అనుభవం ఎదుర్కొన్నాను.
కామన్ గా మేము కోచ్ లతో చర్చిస్తూ ఉంటాం. దీనిలో భాగంగా సీఈవో కూడా టీం ఎంపికలో భాగస్వాములు అవుతారు. ముఖ్యంగా బ్రెండన్ మెకల్లమ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.. ఆయనే స్వయంగా వెళ్లి ఆటగాళ్లకు చెబుతాడు. నిజానికి ఏ నిర్ణయాన్ని తీసుకున్నా అందరూ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. మైదానంలో కూడా ఒకరికి ఒకరు సహకారం అందించడం వల్ల మంచి ఫలితాలు రాబట్టడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నేను కెప్టెన్ గా గర్వపడుతున్నాను..
ఈరోజు ఆడిన ఆట తీరును చూస్తే చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఎంపిక విషయంలో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూరు పాల్గొనడం వల్ల ట్విట్టర్ లో విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక సీజన్ తర్వాత శ్రేయస్ కు ఉద్వాసన తప్పదని అన్షు లు గుప్తా అనేటువంటి యూజర్ అభిప్రాయాన్ని తెలియజేశారు. జట్టు సెలక్షన్ లో సీఈఓ పాల్గొంటారని శ్రేయస్ అన్నారు. ఇది అసలు ఊహించలేదని మరొక యూజర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Shreyas getting sacked after one season after that comment (CEO involved in team selection)? Surely, it will ruffle a few feathers #IPL2022 #MIvKKR
— Anshul Gupta (@oyegupta_) May 9, 2022