జబర్దస్త్ ఆర్టిస్టులు, కమెడియన్స్ అందరూ ఒక చోటికి చేరితే ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. వారు ఒక చోట ఉన్నారంటే హుంగామా, నవ్వులు ఉంటాయి ఆ సెట్ అంతా. అలాంటిది వారి మాటలు అందరిని కంట తడి పెట్టించాయి. ప్రేక్షకులే కాదు ఆర్టిస్టులు కూడా ఎమోషనల్ అయ్యారు లైవ్ షో లో శ్రీ దేవి డ్రామా కంపెనీ ఈటీవీ లో ప్రసారం అయ్యే ఈ షో కి ప్రేక్షక ఆదరణ చాలానే ఉంది. ఇటీవలే విడుదల చేసిన ప్రోమో లో..
ఎమోషనల్ అయ్యారు సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, నటి ఇంద్రజ. ఈ వారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కొందరు వృధులని తీసుకువచ్చారు నిర్వాహకులు వారి కష్ట, సుఖాలని స్టేజ్ పైన పంచుకున్నారు. వారి కన్నీటి గాథలకి చలించిపోయిన స్టేజ్ పై మెంబెర్స్ అంతా ఒక్కసారిగా అక్కడ సైలెంట్ అయ్యారు అంతే కాదు కన్నీరు పెట్టుకున్నారు. ఓ కుమారుడు తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు.
తన కు జరిగిన సంఘటన గురించి చెబుతూ ఏడ్చేశారు ఆ తల్లి. అలంటి వారి గాథలను ఈ ఎపిసోడ్ లో చూపించే ప్రయత్నం చేసారు మల్లె మాల టీం. దయ చేసి ఇలాంటివి చేయకండి మీకు మొక్కుతా అంటూ వేడుకున్నాడు సుడిగాలి సుధీర్. వారిని చూసుకోవడం మన బాధ్యత వారిని సంతోషంగా చూసుకోండి వారు మన కోసం ఎన్నో త్యాగాలు చేసారు. వారు లేని ఇల్లు భాదకరం అంతో చెప్పారు.