ఎన్నో సంవత్సరాల నుండి సినిమాలు సీరియల్స్ షోస్ ద్వారా మనల్ని అలరిస్తూ తెలుగు ఇండస్ట్రీ లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రభాకర్. ప్రస్తుతం ప్రభాకర్ వదినమ్మ సీరియల్ తో పాటు జెమినీ టీవీ లో టెలికాస్ట్ అయ్యే దీపారాధన సీరియల్ లో నటిస్తున్నారు. అంతకుముందు ముద్దుబిడ్డ, సీతామాలక్ష్మి, అంతరంగాలు, చాణిక్య, మూడు ముళ్ల బంధం, అన్నా చెల్లెళ్ళు, ఋతురాగాలు ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు.
ఒక సమయంలో అయితే ఈ టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రతి సీరియల్ లో ప్రభాకర్ ఖచ్చితంగా ఉండేవారు. అలా ఈ టీవీ ప్రభాకర్ గా తెలుగువారందరికీ సుపరిచితులు అయ్యారు. ప్రభాకర్ ఈ టీవీకి క్రియేటివ్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. చాలా సంవత్సరాల క్రితం యాహు షో తో డిఫరెంట్ కాన్సెప్ట్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశారు. తర్వాత అదే ఫార్మాట్ లో ఎన్నో షోస్ వచ్చాయి. వస్తున్నాయి కూడా. Prabhakar serial Actor Family
ప్రభాకర్ జగడం అనే ఒక డాన్స్ రియాల్టీ షో లో కూడా పార్టిసిపేట్ చేశారు. యాహు తో పాటు, స్మైల్ రాజా స్మైల్, స్టార్ వార్, రంగం వంటి షోస్ కూడా చేశారు. ప్రభాకర్ సినిమాల్లో కూడా నటించారు. అలాగే ఎవడి గోల వాడిది సినిమా లో ఆర్యన్ రాజేష్ కి, నీ ప్రేమకై సినిమాలో వినీత్ కి, ఇంకా ఎంతో మందికి డబ్బింగ్ కూడా చెప్పారు.
ప్రభాకర్ తన భార్య మలయజతో కలిసి ఇస్మార్ట్ జోడి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ప్రభాకర్ కూతురు దివిజ, అన్నా చెల్లెళ్ళు సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ లో తన నటనకు నంది అవార్డు కూడా అందుకుంది. దివిజ ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్లీకి చెందిన ద మిక్స్ అనే చానల్ ద్వారా మోడ్రన్ మహానటిగా మనల్ని అలరిస్తోంది.
watch video: