తన రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి, బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన చిత్రం ‘మగధీర’ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒక్కోడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను అంటూ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఇంకా చెవిలో మోగుతూనే ఉన్నాయ్. దర్శకదీరుడు ss రాజమౌళి తీసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులు తిరగ రాసింది.
ఇవి కూడా చదవండి:RRR UPDATE: RRR మొదటి పాట విడుదల తేదీ వచ్చేసింది..ఇంతకీ ఎప్పుడు అంటే.?
magadheera movie
గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా. 2009 జులై 31 న విడుదల అయ్యింది. తన రెండవ సినిమా తోనే రామ్ చరణ్ తన నటనతో మెప్పించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేసిన మిత్ర విందా పాత్ర కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక రామ్ చరణ్ తన రెండవ సినిమా రాజమౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి తెలిసిందే ఈ సినిమాలో అల్లూరి సీత రామ రాజుగా కనిపించబోతున్నారు రామ్ చరణ్.