మనం ఏదైనా గొప్ప పని తలపెట్టి సంకల్పబలంతో దాని పూర్తి చేయాలంటే అందరికీ ఆంజనేయస్వామి ఆదర్శంగా నిలుస్తాడు. ఆయన అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతారు. అలాంటి ఆంజనేయస్వామితో పాటు సువర్చలా దేవుని పూజిస్తాం ఎందుకు. ఇంతకీ ఎవరు ఈ సువర్చలాదేవి అనే విషయం పైన ప్రముఖ అర్చకుడు ప్రకాష్ బాబు న్యూస్ 18 ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.
హనుమంతుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా. సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నిటిని నేర్చుకున్నాడు. ఆపైన నవ్య వ్యాకరణాలుగా పిలవబడే 9 వ్యాకరణాలు కూడా నేర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒకటే ప్రచారంలో ఉంది.
కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్లయిన వారికి మాత్రమే వీటన్నిటిని నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలని పట్టుదలతో ఉన్నాడు.హనుమంతుని సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్య భగవానుడు దగ్గరికి వెళ్లారు. అప్పుడు సూర్యుడు తన వర్చసు నుండి ఒక కుమార్తెను సృష్టించాడు. వర్చసుతో ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చలా అని పేరు పెట్టారు.నా వర్చసుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప ఎవరూ వివాహం చేసుకోలేరు.
ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటూ సూర్యుడు ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపించారని వేద పండితులు ప్రకాష్ బాబు శర్మ అన్నారు. ఆ తర్వాత ఆయనకు నవ్య వ్యాకరణాలన్నీ నేర్పించారు. ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి, హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదట.ఇకపోతే ఖమ్మం జిల్లాలో సువర్చల సుత ఆంజనేయ గుడి కట్టి నిత్యం ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజిస్తున్నారట. అలాగే గుంటూరు జిల్లాలో కూడా సీతారామచంద్రస్వామి తో పాటు శ్రీరామనవమి రోజు నాడు సువర్చలా హనుమంతుడికి కళ్యాణం కూడా చేస్తారట. ఆనాదిగా ఈ ఆచారం వస్తుందట.
Also Read:అట్లతద్ది వల్ల ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందా..? ఎలా అంటే..?