2023 వన్డే క్రికెట్ కప్ పోరు ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో విజేతగా ఆస్ట్రేలియా టీం నిలిచింది. ఇప్పటికి ఆరుసార్లు వరల్డ్ కప్ నెగ్గిన టీం గా రికార్డు సృష్టించింది. అసలు ఆస్ట్రేలియా టీం కి క్రికెట్ అంటే ఎందుకు అంత ఇష్టం. క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయినా కూడా ఆస్ట్రేలియా టీం క్రికెట్ ని ఎందుకు అంత ఓన్ చేసుకుంది. ఏ టోర్నమెంట్ అయినా సరే ఆస్ట్రేలియా ఉంటే మిగతా టీమ్స్ కి ఎందుకు అంత భయం.
లీగ్ దశలో బాగా పెర్ఫార్మ్ చేయకపోయినా ఆస్ట్రేలియా ఫైనల్ దశకు వచ్చేసరికి ఎందుకు అంత స్ట్రాంగ్ అయిపోతుంది… ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఆస్ట్రేలియా టీం ని ఒక్కసారి పరిశీలించాలి….!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాది ఒక సువర్ణ అధ్యాయం. ఏ టీం కి లేని ఘనతలు ఆస్ట్రేలియా టీం కి ఉన్నాయి. వరల్డ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ టీం ఇండియా అయినా కూడా ఆ టీమ్ నే మట్టి కరిపించింది అంటే ఆస్ట్రేలియా ఎంత బలమైన టీమో అర్ధం చేసుకోవాలి. ఆస్ట్రేలియా కి ప్రధాన బలం ఏంటంటే టీమ్ ఎఫర్ట్. కీలకమైన మ్యాచ్ లు వచ్చేసరికి టీమ్ అంతా కూడా యుద్ధానికి వెళ్తున్నట్టు సిద్ధమైపోతుంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది.. ఏదైనా టీం లో టాప్ ఆర్డర్ బాగా ఆడితే మిడిల్ ఆర్డర్ విఫలమవుతారు. కానీ ఆస్ట్రేలియా టీంకు వచ్చేసరికి మ్యాచ్ కీలకమంటే చాలు బౌలర్లు కూడా బ్యాట్స్ మెన్ అవతారం ఎత్తేసి విజృంభిస్తారు.
జరిగేది ఏ టోర్నమెంట్ అయినా సరే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. బలమైన బౌలింగ్ యూనిట్ ఉంది. అలాగే మంచి స్పిన్ బౌలర్స్ కూడా ఉన్నారు. అన్నిటికీ మించి నెగ్గుతామనే కాన్ఫిడెన్స్ ప్రతీ ప్లేయర్ లోనూ కనిపిస్తుంది. ఇక ఫీల్డింగ్ విషయానికొస్తే ఫీల్డ్ లో చిరుతపులుల్లా పరిగెడుతూ ఉంటారు.ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నందునే ఆస్ట్రేలియా ఒక గొప్ప టీం గా కొనసాగుతుంది. అన్ని వరల్డ్ కప్పులు కైవసం చేసుకోగలిగింది. టీంలో ఎంతమంది మారినా కూడా కొత్తవారు వచ్చినా కూడా సేమ్ టీం ఎఫర్ట్ కొనసాగించడం గ్రేట్….!
Also Read:ఈ ప్లేయర్ ఉండి ఉంటే… కచ్చితంగా కప్ కొట్టే వాళ్ళం ఏమో..?