ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నారని మాజీ ఎంపీ
కొండా విశ్వేశ్వర రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శలు గుప్పించిన ఓ వీడియోను బీజేపీ నాయకురాలు విజయ శాంతి పోస్ట్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ నేత, తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌కు తమ మద్దతు ఉంటుందని ఆ ఇద్దరు నేతలు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో కొనసాగుతోన్న టీఆర్ఎస్ పాలనపై ఆమె విమర్శలు గుప్పించారు.
Also Read : “జానకి వెడ్స్ శ్రీరామ్” హీరో రోహిత్ గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి.!
“తెలంగాణ ఉద్యమకారులను సమర్ధించడం అంటే ప్రస్తుతం తెలంగాణ ను బతికించుకోవటం.
జన్మంతా జంగ్ చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు నిరంకుశ, నియంత్రత్వ, దొర అధిపత్య పరిపాలన రాజ్య అహంకారానికి బలైతున్నప్పుడు అనే ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఈ తిరుగుబాటు పోరాటాలే మరోసారి అసలైన ఉద్యమ ఆకాంక్షల తెలంగాణ దిశగా భవిష్యత్తు గమనాన్ని సూచించగలగాలని అభిప్రాయపడుతున్నాను.అంటూ తెలిపారు
విజయశాంతి.
ఈ తిరుగుబాటు పోరాటాలే మరోసారి అసలైన ఉద్యమ ఆకాంక్షల తెలంగాణ దిశగా భవిష్యత్తు గమనాన్ని సూచించగలగాలని అభిప్రాయపడుతున్నాను.
విజయశాంతి
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 19, 2021