ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.
మీకు ఉగాది అంటే ఏమిటో అర్థం తెలుసా? ఉగాది అనే పదం ఎలా వచ్చిందో తెలుసా..? ఉగాది అనే పదం ‘యుగాది’ నుండి పుట్టుకొచ్చింది. ఉగాదిలో “ఉగ” అంటే నక్షత్ర గమనం. ”ఆది” అంటే మొదలు. మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట. అలా యుగానికి ఆది ‘యుగాది’ అయింది. ‘యుగాది’కి మరో పేరు ‘ఉగాది’ అయింది.
ప్రతి ఏటా వచ్చే ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ‘ఉగాది’ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాలని అంటారు. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి.ఈ ఏడాది వచ్చిన శ్రీ శార్వరి నామ సంవత్సరానికి అర్థం : శార్వరి అనే పదం ప్రత్యేకంగా అమ్మ వారి కోసం చెప్పబడింది. నిషా కాలాన్ని శర్వారి కాలం అంటారు. నిషా అనగా రాత్రి కటిక చీకటి అని అర్ధం. దుర్గ మత దేవత సంచార కాలంలో సంచరిస్తుంది. కటిక చీకట్లను ప్రలదొరుతుంది అని అర్ధం .
ఉగాది పండుగ విశిష్టత : ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది పర్వదినం.
మామిడి పువ్వుకి మాట వచ్చింది. కోకిల గొంతుకి కూత వచ్చింది. వేప కొమ్మకి పూత వచ్చింది. పసిడి బెల్లం తోడు వచ్చింది. గుమ్మానికి పచ్చని తోరణము వచ్చింది.
శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు