ప్రస్తుతం ఐపీఎల్ లో ఫాస్ట్ బౌలింగ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది సన్రైజర్స్ హైదరాబాద్ పెసరు ఉమ్రాన్ మాలిక్. ఆయన బంతి వేగం చాలా స్పీడ్ గా ఉంటుంది. దీంతో ఫాస్ట్ బౌలర్ గా పేరు పొందారు. ఈ క్రమంలో ఇమ్రాన్ మాలిక్ ను జాతీయ జట్టులోకి తీసుకురావాలని వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు..
అత్యంత వేగంతో ఐపీఎల్ 15 లో అదరగొడుతున్న మాలిక్ ను ఇప్పుడే జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. మాలిక్ చాలా చిన్న వయసు ఉన్న వాడని, ఇప్పుడే అతన్ని జాతీయ జట్టులోకి తీసుకుంటే ఒకవేళ విఫలమైతే అతని కెరీర్ నాశనమవుతుందని అన్నారు. ఇలాంటి అరుదైన బౌలర్లను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని సూచన చేశారు.
గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసే ఉమ్రాన్ ఐపీఎల్ లో రెండవ వేగవంతమైన బంతి విసిరిన ఆటగాడిగా పేరు పొందాడు. అలా వేయడం అనేది మామూలు విషయం కాదు అని నాకు తెలుసు, కానీ అతను ఇప్పుడే జాతీయస్థాయిలో తీసుకుంటే విఫలమైతే మాత్రం మొదటికే మోసం వస్తుందని అన్నారు.
అలా కాకూడదంటే ముందుగా ఉమ్రాన్ ను దేశవాళీ క్రికెట్ లో ఆడించి, ఆ తర్వాత ఒక సీజన్ పూర్తిగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడించి, దాని తర్వాత ఇండియా ఏ కు ఎంపిక చేయాలన్నారు. ఇలా నాలుగైదు సిరీస్ లకు పంపి తర్వాత జాతీయ జట్టులోకి తీసుకోవాలని తెలియజేశారు.
అయితే సిమ్రాన్ బౌలింగ్ ను చూసి ఫిదా అయినటువంటి భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్ ఉమ్రాన్ మాలికను వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఈ విషయంలో తాత్సారం చేయడం కూడా మంచిది కాదు అని వారు చెబుతున్న మాట.