స్టార్ హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ సాధిస్తూ ఉంటాయి. అంతే కాదు వాళ్లకు స్క్రీన్ పైన కనపడితే చాలు అనుకునే ఫాన్స్ కోట్లలో ఉన్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పనవసరం లేదు. సినిమాలు ప్లాప్ హిట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ సాధిస్తూ ఉంటాయి.
‘అజ్ఞాతవాసి’ సినిమా నిరాశపరిచిన తరువాత మళ్ళీ మరో సినిమా చేయలేదు, రాజకీయాలలో బిజీ అయ్యారు. కొంత గ్యాప్ తరువాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తరువాత చేసిన సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా, TRP రేటింగ్స్ అనుకున్నంతగా సాధించలేదనే చెప్పాలి. దీనితో ఒకింత నిరాశకు గురయిన ఫాన్స్ అసలు ఎందుకు ఇలా అయ్యిందని ఆలోచనలలో పడ్డారు. జీ తెలుగు లో ప్రసారం అయినా ఈ సినిమా కేవలం 19.12 రేటింగ్ సాధించింది.
ఇవి కూడా చదవండి : మణిరత్నం మ్యాజిక్ “నవరస” ట్రైలర్ వచ్చేది అప్పుడే..!
ఇవి కూడా చదవండి : అతని బట్టలు చూసి తక్కువ అంచనా వేసి అవమానించారు…చివరికి ఏమైందో తెలుసా.?
జీ తెలుగు ఛానల్ కాకుండా మరో ఛానల్ లో ప్రసారం అయి ఉంటే రేటింగ్స్ మరోలా ఉండేవని కామెంట్స్ వినపడుతున్నాయి. జీ తెలుగు ఛానల్ కవరేజ్ తక్కువగా ఉండటం, ఓటీటి లో విడుదల అయినా కొద్ది రోజులకి మళ్ళీ ప్రసారం అవ్వడం, ఇప్పటికే చాలా వరకు ఓటీ టి లో చేసిన ప్రేక్షకులు, ఫాన్స్ కారణం వల్లే తక్కువ రేటింగ్స్ వచ్చాయని చెబుతున్నారు.