ప్రస్తుత కాలంలో చాలా జంటల్లో మూడుముళ్ల బంధం అనేది మూన్నాళ్ళకే ముగుస్తోంది. క్షణికావేశం, ఆలోచన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. మరి ఏం జరిగిందో తెలుసుకుందాం. సాక్షి కథనం ప్రకారం మాడుగుల మండలం లోని అర్కపల్లి కి చెందినటువంటి మానసను వనస్థలిపురం లోని క్రిస్టియన్ కాలనీకి చెందిన దేవి రెడ్డికి ఇచ్చి ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేశారు.
అయితే దేవి రెడ్డి అక్కడే మెడికల్ కంపెనీ లో పని చేస్తుండగా, మానస కూడా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సంసారం బాగా కొనసాగుతున్న సందర్భంలో మానసకి, దేవి రెడ్డి కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో మానస తన తల్లిదండ్రులతో ఒక విషయాన్ని చెప్పింది. దేవిరెడ్డి సంసారానికి పనికిరాడని తెలియజేసింది. దీంతో గొడవలు ముదిరిపోయయి. ఈ విషయం తెలుసుకున్న దేవిరెడ్డి ఇక మానసను కొట్టడం మొదలు పెట్టాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా పెట్టి ఇరువురికి సర్ది చెప్పారు.. అయినా గొడవలు తగ్గలేదు. దీనిపై 2001లో దేవి రెడ్డి మీద మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పటి నుంచి మానస తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు కుటుంబ సభ్యులతో వెళ్ళింది మానస. కానీ ఆమె అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించిందని చెప్పారు. మళ్లీ గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు ఆమె మరణించిందని ధ్రువీకరణ చేశారు. అయితే మానసిక క్షోభ వల్లే మానస మృతి చెందిందని దీనికి కారణం దేవిరెడ్డి అంటూ ఆయన వచ్చి అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేస్తూ ఇంటికి తాళం వేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మృతురాలి తరుపు బంధువులు ధర్నాకు దిగారు.