ప్రస్తుత కాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే “అశోకవనంలో అర్జున కళ్యాణం” మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి ఎంతో పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రత్యేకంగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్నామా దాస్ నుండి పాగల్ వరకు కొత్త కొత్త వెరైటీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం మే ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో ప్రమోషన్స్ చాలా వెరైటీ గా తీస్తున్నారు. ఒక ఫ్రాంక్ వీడియో చేసి చాలా హంగామా చేశారు మూవీ చిత్ర యూనిట్. అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ అంటూ ఒక యువకుడు పెట్రోల్ మీద పోసుకుంటానని బెదిరిస్తూ రాలేదని బయపెడతాడు.
33 సంవత్సరాలైనా అర్జున్ కుమార్ అల్లంకు పెళ్లి కావడం లేదని, అతన్ని నేను చూడాలంటూ కారుకు అడ్డంగా పడుకుని రోడ్డుపై హంగామా సృష్టిస్తూ పెట్రోల్ మీద పోస్కోబోతాడు. దీంతో హీరో విశ్వక్సేన్ అతన్ని చూపిస్తానంటూ అడ్డుకుంటాడు. ఈ విధంగా విశ్వక్సేన్ మే ఆరో తారీఖున పెళ్లి జరుగుతుందని నేను అక్కడికి తీసుకెళ్తాను అని చెబుతూ ఫ్రాంక్ వీడియో చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఏది ఏమైనా చిత్ర యూనిట్ ప్రమోషన్ చాలా వెరైటీ గా ప్లాన్ చేస్తూ సినిమా రేంజ్ ఇంకా పెంచుతున్నారని చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో పెళ్లి చూపుల కోసం వెళ్లిన అబ్బాయికి ఏదో తెలియని గందరగోళం చిన్నపాటి అయోమయం ఆత్రుత ఉంటాయి. వాటి గురించి పూర్తిగా ప్రస్తావించే లా ‘ సిన్నవాడా’ సాంగ్ ఉన్నది.
జానపదంతో సాగే ఈ పాట ఉండడంతో అందరికీ డిఫరెంట్ గా అనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీని విద్యాసాగర్ చింత తెరకెక్కించారు. సూపర్ హిట్ సినిమా రాజావారు రాణి గారు సినిమా డైరెక్టర్ రవికిరణ్ కోల మాటలు కథ స్క్రీన్ ప్లే అందించడం చాలా విశేషం. దీనికి జై క్రిష్ సంగీతం అందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా వెరైటీగా నిర్వహిస్తూ మే 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://fb.watch/cJ_kibRpjh/