- చిత్రం : మట్టి కుస్తీ
- నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, మునీష్ కాంత్,
- నిర్మాత : విష్ణు విశాల్, రవితేజ (విష్ణు విశాల్ స్టూడియోస్, RT టీమ్‌వర్క్స్)
- దర్శకత్వం : చెల్ల అయ్యావు
- సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
- విడుదల తేదీ : డిసెంబర్ 2, 2022
స్టోరీ :
Matti Kusthi Telugu Movie Review: వీరా (విష్ణు విశాల్) ఎటువంటి లక్ష్యాలు లేకుండాఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తల్లితండ్రులు లేని విరని అతని మామయ్య పెంచుతాడు. అతని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినపుడు,తను పెళ్లి చేసుకోవాలంటే చదువుకోని అమ్మాయి అయ్యుండాలని, ఆమెకు పెద్ద జడ ఉండాలనే షరతులు పెడతాడు. కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) రెజ్లర్, స్వతంత్ర భావాలు కలిగి ఉంటుంది. నేషనల్ లెవల్ కుస్తీ పోటీల్లో పాల్గొనాలన్నదే ఆమె కల.
అయితే ఆమె తండ్రి అందుకు ఒప్పుకోడు. కుస్తీ పడే అమ్మాయి అని వచ్చిన సంబంధమల్లా చెడిపోతుంది. ఆ తరువాత కీర్తి బాబాయ్ (మునీష్ కాంత్) అనుకోకుండా చిన్నప్పటి స్నేహితుడు వీరా మామయ్యని కలుస్తాడు. మాటల్లో వీరా గురించి, అతను పెళ్లికి పెట్టిన కండిషన్స్ విని, కీర్తి 7వ క్లాస్ వరకే చదివిందని, తనకు పెద్ద జడ కూడా ఉందని నిజాన్ని దాచి, వీరా, కీర్తి లకు పెళ్లి చేస్తారు. ఆ తరువాత వీరాకు కీర్తి గురించి నిజం బయటపడుతుంది. అప్పుడు వీరా ఏం చేస్తాడు? వారిద్దరి మధ్య వచ్చే గోడవలేంటి? వారిద్దరూ చివరకు ఒకటయ్యారా, లేదా? అనేది కథ.Matti Kusthi Review in Telugu రివ్యూ :
కోలీవుడ్ హీరోలు ప్రస్తుతం తెలుగులో తమ మార్కెట్‌ను పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాంటి కోలీవుడ్ హీరోలలో ఒకరు హీరో విష్ణు విశాల్. రానా హీరోగా చేసిన ‘అరణ్య’ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు ఈ హీరో. విష్ణు విశాల్ నిర్మాత కూడా. FIR మూవీ నుండి తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టాడు. హీరో రవితేజతో కలిసి తన మూవీస్ ను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
రవితేజతో కలిసి విష్ణు విశాల్ తమిళంలో ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘గట్టా కుస్తీ,. ఆ సినిమానే తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో రిలీజ్ చేశారు. మట్టి కుస్తీ అనగానే అందారు ఇది స్పోర్ట్స్ డ్రామా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, రెజ్లింగ్ కూడా ఉంటుందని మూవీ యూనిట్ ముందే చెప్పింది.
Vishnu Vishal అతనికి యాక్షన్ సీక్వెన్స్ బాగా సెట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు అట్రాక్షన్ కీర్తి పాత్రే. ఐశ్వర్యా లక్ష్మి రెజ్లర్‌గా అద్భుతంగా నటించింది. ఆమె తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ కట్టిపడేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో అదిరిపోయే యాటిట్యూడ్‌ను చూపించింది. మిగిలిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ :
- ఐశ్వర్యా లక్ష్మి నటన
- కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- ఊహించదగిన సన్నివేశాలు
రేటింగ్ :
2.5
ట్యాగ్ లైన్ :
ఓవరాల్ గా మట్టి కుస్తీ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఒకసారి చూడొచ్చు.
watch trailer :