వరుణ్ సందేశ్, వితిక గతేడాది ‘బిగ్ బాస్3’ సందడి చేసిన ఈ జంట..బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్ టాప్ 4 గా నిలిచాడు. ఒక్క తెలుగులోనే తొలిసారి భార్యాభర్తలు కలసి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అలా వరుణ్ సందేశ్, వితిక షేరు కొత్త రికార్డు సృష్టించారు. 12 ఏళ్ల కెరీర్లో చాలా ఎత్తుపల్లాలు చూసిన వరుణ్ సందేశ్‌కి బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ వచ్చింది.
చాలామందికి వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుసు. కానీ వీరి ప్రేమ కథ గురించి తెలిసిన వాళ్లు కొందరే. వరుణ్, వితికల మధ్య ప్రేమ పుట్టడానికి 2015లో విడుదలైన ఈ “పడ్డానండీ ప్రేమలో మరీ” చిత్రంతో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో.. కేవలం మూడు నెలలు మాత్రమే వీళ్లు మాట్లాడుకున్నారట.
ఆ తర్వాత కొన్నాళ్లు విడిగానే ఉన్నా.. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం, ప్రేమ ఏర్పడ్డాయి.వరుణ్‌కి తనపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకున్న వితిక.. తనని ప్రపోజ్ చేసిందట. ఆ తర్వాత రెండు వైపులా పెద్దవాళ్ల అనుమతి తీసుకొని ప్రేమను పెళ్లి పీటలెక్కించారీ జంట. ఆ తర్వాత అదే సంవత్సరం అంటే.. 2015 డిసెంబర్లోనే ఎంగేజ్మెంట్తో ఒక్కటైందీ జంట. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకొని.. 2016 ఆగస్టు 19న హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో పెళ్లి చేసుకున్నారు.తాజాగా చీరకట్టులో ఫోజులిచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Image Source: Instagram