బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ గా ప్రసారమయ్యే షో సీజన్ 1 గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ముగిసిందని చెప్పవచ్చు. రాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంటాయని బిగ్బాస్ లవర్స్ అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బుధవారం రాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేశారు.. దీనికి కారణం ఏమిటి.. ఎందుకు ఇంత త్వరగా క్లోజ్ చేయాల్సి వచ్చిందని బిగ్బాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి సీజన్లో ఓటింగ్ లైన్స్ 5 రోజుల పాటు ఉంటారు. ఆదివారం రాత్రి నుండి శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కి సంబంధించినటువంటి ఫేవరెట్స్ వాళ్లకి ఓట్లు అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన టువంటి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఓటింగ్ ప్రక్రియ ను ముందుగానే క్లోజ్ చేశారు. దీనికి ప్రధాన కారణం మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే టాక్ కూడా వినపడింది.
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ ఈ సారి టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ ను ఉంచారు బిగ్ బాస్. వారి యొక్క జర్నీ లు కూడా చూపిస్తూ వాళ్ళని కూడా ఫైనలిస్ట్ లని చేశారు. ఇందులో బాబా భాస్కర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయ్యాడు. దీంతో ఫైనల్ కు ఏడుగురు కంటెస్టెంట్ వచ్చాడు. అయితే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇద్దరిని చేయవలసి వస్తుంది.
అందుకోసమే ఓట్స్ ప్రక్రియను బుధవారానికి క్లోజ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల బిగ్బాస్ పార్టిసిపెంట్స్ ఎవరిని ఎలిమినేషన్ చేసిన ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఓటీటీ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూస్తే మాత్రం బాబా భాస్కర్ మరియు అనిల్ రాథోడ్ ఇద్దరు కూడా ఇద్దరూ లిస్టు లోనే ఉన్నారని, బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా వీరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం, ఇక మిగిలినటువంటి వారిని టాప్ 5 పినాలిలో ఎలిమినేషన్ చేయవచ్చు.