Rashi Phalalu 16-08-2021 : రాశి ఫలాలు వాటి ఫలితాలు ప్రతి రోజు మార్పులు ఉంటాయి, వాటిని అనుసరించి ఏది ఎలా చేయాలో మనం జాగ్రత్త వహిస్తే మనకు మంచిది. ఇవాళ్టి రాశి ఫలాలు అనగా 16 ఆగష్టు 2021 ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Rashi Phalalu 16-08-2021
మేష రాశి: ఇవాళ మీకో ఒక శుభవార్త తప్పకుండా ఉంటుంది. పనులు అన్ని సకాలంలో తప్పకుండా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వెయ్యడం మంచిది. నూతన వస్తువులు కొనుగోలు, మీ దగ్గరి బంధువులు, మిత్రుల నుంచి మీకు పూర్తి సహకారం.
వృషభ రాశి: సమాజంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విహారయాత్రలు వెళ్లే ఆలోచనలు చేస్తారు, ధనలాభం సమృద్ధిగా ఉంటుంది, అధిక శ్రమ ఉన్నాకూడా అనుకున్న సమయంలో మీ పనులు పూర్తి చేస్తారు, బంధువులు, మిత్రులతో విందులు, మీ దగ్గరివారికి ఆర్థిక సహాయం చేస్తారు.
మిథున రాశి: నూతన పరిచయాలు, ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం మంచిది, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచింది, ఉత్తమమైన నిర్ణయాలతో మీ సమస్యలు ఒక కొలిక్కి తెస్తారు.
కర్కాటక రాశి: మీకు ఉన్న పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు, మీ ఆరోగ్యం క్షేమం, మీ మాటకు మరింత విలువ పెరిగి మీకు మరింత గౌరవం లభిస్తుంది, వ్యాపారం నిలకడగా ఉంటుంది, Horoscope today in telugu వృత్తి రీత్యా మీకు అన్ని సజావుగానే కొనసాగుతాయి. మీ ఆర్థిక సమస్యల నుంచి బయట పడుతారు.
Horoscope Today in Telugu
సింహ రాశి: ఇప్పుడు చేస్తున్న మీ పనులు భవిష్యత్ కి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇంతకాలం మీరు చేతికి అందని డబ్బు, ఇచ్చిన రుణాలు తిరిగి మీకు వస్తాయి. సమాజంలో మీకు పలుకుబడి పెరుగుతుంది, గత కొంత కాలంగా పూర్తి కాని పనులన్నీ ఇప్పుడు పూర్తి చేసుకుంటారు.
కన్యా రాశి: ఆర్థిక పరిస్థితిలో పురోగతి, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు, ముఖ్యమైన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన సమయంలో పూర్తి చేసుకుంటారు, మీకు మునుపెన్నడూ లేనంత మంచి సమయం నడుస్తుంది.
తులరాశి: మీ అవసరాలకి తప్పక రుణాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు, చికాకులు తొలగుతాయి, శుభవార్తలు వింటారు, మీ కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు, ఉద్యోగస్తులకు అనుకూలం, మీకు ముఖ్యమైన వ్యవహారాలు, సమస్యల్లో దగ్గరి వారి సలహాలు, సూచనలు అవసరం.
వృశ్చిక రాశి: మీ మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరబోతుంది. వ్యాపారస్తులకు మంచి కాలం నడుస్తుంది, మీ ముఖ్యమైన పనుల్లో మీ నిర్ణయాలతో పాటు, మీ కుటుంబ సభ్యుల నిర్ణయాలు కూడా తీసుకోవడం మంచిది. మీకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉన్నా ఆత్మ విశ్వాసంతో మీ పనులని పూర్తి చేసుకుంటారు.
రాశి ఫలాలు, నేటి రాశి ఫలాలు
ధనస్సు రాశి: మీ సంకల్ప బలంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటారు, గృహాలు, వాహనాల కొనుగోలుకు అనుకూలం. వాయిదా పడుతూ ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి.
మకర రాశి: కుటుంబ పరంగా కొన్ని సమస్యలు, చికాకులు ఉన్నా మీ ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సమస్యలు తప్పవు.
కుంభ రాశి: బంధు మిత్రుల నుంచి ఆర్థిక సహాయాలు అందుతాయి. అదనపు ఆదాయాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ,వాహన యోగం స్పష్టంగా ఉంది. మీ పనులని పట్టుదలతో, దృడ సంకల్పంతో పూర్తి చేస్తారు.
మీనా రాశి : వ్యాపారాలు అనుకూలం. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్నా సమస్య ఒకటి తొలిగిపోతుంది.ప్రస్తుతం మీరు చేస్తున్న పనుల్లో అధిక లాభం ఉంటుంది. మీకు మంచి కాలం నడుస్తుంది.