చాలా తక్కువ రేట్ లో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం ఏంటంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది గుడ్డు.. కరోణ సమయంలో డాక్టర్లు గుడ్లని తినాలని చెప్పారు. ఎందుకంటే గుడ్డులో ఉండే పోషక పదార్థాలు మనకు శక్తి నివ్వడమే కాకుండా కరోణాతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రెండు రకాల గుడ్లు ఉన్నాయి.. వీటి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది.. మరి ఆ గుడ్లు ఏమిటి.. వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం..?ఈ గుడ్డులో తెల్ల గుడ్డు కన్నా బ్రౌన్ రంగులో ఉండే గుడ్డు మంచిది. ఎందుకంటే ఎలాంటి మందులు లేకుండా ఈ కోళ్లను పెంచుతారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం గోధుమ గుడ్డు అమ్మే వ్యక్తులు తెల్ల గుడ్డు కన్నా గోదుమ రంగు గుడ్డు చాలా ఆరోగ్యకరం అని చెబుతూ మార్కెటింగ్ చేస్తున్నారు.ఈ విధంగా గోధుమ రంగు గుడ్లను ధర పెంచి అమ్మడం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.. వాస్తవంగా చూసుకుంటే తెల్ల గుడ్డు అయినా గోధుమరంగు గుడ్డు అయినా రెండు గుడ్లే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రంగులను అడ్డంపెట్టుకుని గుడ్లలో తేడా చూపించి దందా సాగిస్తున్నారు. ఇందులో పోషకాల విషయానికి వస్తే గోధుమ మరియు తెలుపు గుడ్ల మధ్య తేడా ఏమీ ఉండదు. గోధుమ రంగు గుడ్లను మన దేశంలో ఉన్నటువంటి నాటు కోళ్లు మాత్రమే పెడతాయి. రంగులో తేడా ఉన్నా ఆ గుడ్లలో ఉండే పోషక విలువలు మాత్రం ఒక్కటేనని నిపుణులు అంటున్నారు.