Winter Tips: శీతాకాలంలో అధిక బరువు సమస్య అనేది చాలామందిని వేధిస్తుంది.అయితే ఇలా బరువు పెరగడానికి కూడా చాలా రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా బరువు ఎక్కువ పెరగకుండా ఉండటానికి సూచనలు చెప్తున్నారు. ఇక చలికాలంలో చాలా మంది నీరు తక్కువ తాగుతారు. ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంటారు.అందువల్ల కూడా బరువు పెరుగుతారు. ఈ కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. వెచ్చని ఆహారం శరీర యొక్క ఉష్ణోగ్రత పెంచడానికి మరియు మానసిక స్థితిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. అయితే అందులో ఉండే అదనపు కార్బోహైడ్రేట్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాల వల్ల కూడా బరువు పెరుగుతారు.అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సి ఉంటుంది.
అయితే చలికాలంలో ఎక్కువగా ఆకుపచ్చని ఆహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు,ఆకుపచ్చని కూరగాయలలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. వాటి వల్ల శీతాకాలంలో అవి ఎక్కువగా తీసుకోవాలి.ఇలా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. అందులోనూ మధుమేహం ఉన్నవారు ఇలాంటి ఆహారం తినడం వల్ల మేలు కలుగుతుంది. చలికాలంలో ఎక్కువగా అందుబాటులో ఉండే సీతాఫలాలు, అరటి, జామకాయ,రేగుపండ్లు, పియర్స్, లాంటి పండ్లను సలాడ్ల రూపంలో తీసుకుంటే చాలా మంచిది. పప్పులు, గింజలు, తృణధాన్యాల వంటివి కూడా ఎక్కువ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
చలికాలంలో శరీరంలో వేడిని పెంచేటువంటి బాదం, అవిశె గింజలు,వాల్నట్స్, నల్ల నువ్వులు, దోసకాయ గింజల లాంటివి తింటే ఫలితం ఉంటుంది. ఈ సీజన్లో ఐస్ క్రిములు,స్వీట్స్ వంటివి తినకుండా వేడి సూప్స్ తీసుకోవటం చాలా మంచిది. స్పైసీ సూప్స్ చెడు కొవ్వును తగ్గిస్తాయి. అంతేకాకుండా అందులో వాడే మిరియాల పొడి వల్ల జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి.ఫ్రై చేసిన స్నాక్స్‌ని ఎక్కువగా తీసుకోవద్దు. వీటివల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. దాంతో బరువు కూడా పెరుగుతారు. ఫ్రైడ్ స్నాక్స్ బదులుగా క్యారట్ స్టిక్స్, బీట్ రూట్, నిమ్మరసం ఇలా వేరే వేరే ఆప్షన్లను చూసుకోవాలి. మంచి ఆహారాలతో పాటు రోజులో కొంత సమయాన్ని శారీరక వ్యాయామానికి కేటాయిస్తే బరువు అనేది పెరగకుండా చూసుకోవచ్చు.