నటి జయలక్ష్మి అంటే తెలియని వారు ఉండరు. ప్రేక్షకులకు చాలా తెలిసిన నటి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని మంచి పేరు తెచ్చుకుంది. తాను ఇండస్ట్రీలో ఎంతో ఎదిగినప్పటికీ తన కూతురిని మాత్రం ఇండస్ట్రీలో తీసుకురావాలనుకోవడం లేదని చెబుతున్నారు జయలక్ష్మి.
బాలనటిగా చేసింది చాలు హీరోయిన్ గా చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెబుతోంది. ఇంతకీ ఆమె కూతురు ఎవరో మీకు తెలుసా.. తెలుసండి అందరికీ తెలిసిన బాలనటి.. గుర్తు రాలేదా జయం సినిమాలో సదా చెల్లెలుగా చేసిన అమ్మాయి జయ లక్ష్మి కూతురు యామిని శ్వేత గుర్తొచ్చింది అనుకుంటా..?అయితే ఆ మూవీ తరువాత మరో సినిమాలో నటించలేదు.
ఇన్ని రోజుల నుంచి అమెరికా లో ఉన్నటువంటి శ్వేత పెళ్లి చేసుకొని కొన్ని కోట్ల ఆస్తులకు యజమానురాలిగా మారింది. ఇటీవల వారి సొంత స్థలం అయిన విజయవాడకు మకాం మార్చింది. అయితే శ్వేత అమెరికా నుంచి తిరిగి రావడం వల్ల ఇండస్ట్రీలో ఒక పెద్ద చర్చ సాగుతోంది.
జయం వంటి సక్సెస్ ఫుల్ మూవీలో నటించిన శ్వేత మళ్లీ సినిమాల్లోకి వస్తుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. కానీ తన తల్లి జయలక్ష్మి మాత్రం నా కూతుళ్లను ఇండస్ట్రీకి పంపేది లేదని చెబుతోంది. ఇండస్ట్రీలో నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని, నా కూతుర్లు అలాంటి బాధలు పడకూడదని విదేశాలకు పంపాను అని చెప్పింది.
నా బిడ్డను బాలనటిగా చూడాలనుకున్నాను.. చూశాను.. ఆశ తీరిపోయింది.. ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఒప్పుకోలేదు. వివాహం చేసుకొని విదేశాల్లో చాలా ఆనందంగా ఉంది. నా నా మాట ఎప్పుడు కాదనరు అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకంటే ఆనందం నాకు ఇంకేం కావాలి.. ఈ మధ్య కాలంలో యామిని శ్వేత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అది చూసిన వారంతా షాక్ కు గురయ్యారు.