YSR Kadapa: కడప జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసిన బీజేపీ నేతల ధర్నా ! అనుమతి లేని టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసారంటూ.. కడప జిల్లా ప్రొద్దుటూరు లో బీజేపీ నేతల ధర్నా స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పై ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తో పాటుగా బీజేపీ పార్టీ నేతలు ఆందోళన చేయగా పురపాలక సంస్థ కార్యాలయం బయట తమ నిరసనను ని వ్యక్తం చేస్తుండగా.
దీనితో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు కోరగా వారు ఇంతకు వినకపోవడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టిన @YoothMla ని అరెస్టు చేసే దమ్ములేని ఈ @YSRCParty ప్రభుత్వానికి , శాంతియుతంగా నిరసన చేస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం సిగ్గుచేటు..!@JPNadda @blsanthosh @Sunil_Deodhar @somuveerraju @Madusa_rocks @BJP4Andhra pic.twitter.com/iMMQya812n
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) July 27, 2021
ఈ సందర్భగా బీజేపీ నేత విషువర్ధన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ జిన్నా రోడ్డులో అనుమతి లేని టిప్పు సుల్తాన్ వివాహాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని ని అరెస్ట్ చెయ్యకుండా శాంతియుతంగా నిరసన చేస్తున్న తమని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమను అరెస్ట్ చేయడం ఏంటని మండి పడ్డారు. ఈ సందర్బంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపూసలాట జరిగింది.