ప్రస్తుతం కాలం మారింది. ఆడవాళ్లు కూడా మగవాళ్లతో సమానంగా ప్రతి పనిలో పోటీపడుతున్నారు. లింగ భేదం లేకుండా వీరనారిగా ఎదురొడ్డి నిలుస్తున్నారు. ఏ సమస్య వచ్చినా బయటకు వచ్చి నిలదీస్తున్నారు. మగాడి కింద ఆడది అణిగిమణిగి ఉండాలి అనే పదానికి చరమగీతం పాడేస్తున్నారు. తనకు అన్యాయం జరిగితే గళ్ళ పట్టి అడిగే స్థాయికి చేరుకున్నారని ఇలాంటి ఘటనలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. మరి అది ఏంటో చూద్దాం..!
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా బిర్యాని పాయింట్ నడుపుతున్న ఒక వ్యక్తి పై మహిళ కారంపొడితో దాడి చేసింది. అయితే దాడికి పాల్పడింది మాత్రం అతని ప్రియురాలు అని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందినటువంటి యువరాజు.. సత్తుపల్లిలో దమ్ బిర్యాని పాయింట్ నడుపుతున్నాడు. అతనికి వివాహం కూడా అయింది అతని భార్య కస్తూరి స్వగృహంలోనే ఉంటుంది. ఈ సందర్భంలో ఆ యువరాజు తన హోటల్లో పని చేస్తున్నటువంటి సత్యవతి అనే మహిళతో మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు.
కానీ గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ సందర్భంలోనే సదరు మహిళ బిర్యాని పాయింట్ వద్దకు వచ్చి మరీ కారంపొడితో దాడి చేసింది. నా కష్టంతోనే యువరాజ్ ఈ స్థాయికి వచ్చాడని అలాంటి నన్ను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటూ సత్యవతి ధైర్యంగా ఆందోళన చేస్తోంది. తనని అడ్డుకోవడానికి వచ్చినటువంటి కొందరి పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా డబ్బులు మొత్తం అతని భార్య పిల్లలకే పంపిస్తున్నాడు అని రచ్చ చేసింది. కారంపొడి అతని కంట్లో చల్లి ధైర్యంగా అతని గల్ల బట్టి బయటకు తీసుకు వచ్చి ఎడాపెడా మాటలతో వాయించింది. తర్వాత ఇద్దరూ వెళ్లి ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు.