మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎంట్రీ మూవీ గా ‘ఉప్పెన‘ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం కారణంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.ఇది ఇలా ఉండగా అందులో నీ కన్ను నీలి సముద్రం సాంగ్ యువత గుండెల్లో రింగురింగుమని మోగుతోంది.ఈ హీరోయిన్ కి కుర్రకారులందరు ఫిదా అవుతున్నారు. ఉప్పెన రిలీజ్ అవకముందే క్రితి శెట్టి కి మరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.కుమారి 21f ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో జీఏ 2 పిక్చర్స్ పతాకాలపై బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘18 పేజీస్’ చిత్రంలో క్రితి శెట్టిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నారట. ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది.
‘ఉప్పెన’ మూవీ హీరోయిన్ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ