మీ చిన్నప్పుడు మీరు పిడుగులు పడినప్పుడు భయపడితే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు అర్జున ఫాల్గుణ అని నామాలు జపించమని చెప్పారా? అవి ఎందుకు జపిస్తారో తెలుసా ? ఇలా జపించడానికి రెండు కారణాలున్నాయి. అవేంటి అంటేమొదటి కారణం ఏంటి అంటే మీరు ఒకవేళ మామూలు సందర్భాల్లో మంత్రం జపిస్తే నరుడు నారాయణుడుని తలచుకుంటున్నట్లు అర్థం. అంటే మానవుడు దేవుడిని జపిస్తున్నట్లు. మనం మామూలుగా దేవుడిని తేల్చుకుంటాం కదా అలాగే ఈ మంత్రాన్ని జపిస్తారు. ఇంకా రెండవ కారణం ఏంటి అంటే సందర్భానుసారం మాత్రం చెప్పడం. వర్షం పడుతున్నప్పుడు ఈ మంత్రం చెప్తే పిడుగులు ఆగిపోతాయి. అంటే ఈ మంత్రం జపిస్తే పిడుగులు రాకుండా రక్షించమని దేవుడిని కోరుకుంటున్నట్లు అర్థం. ఈ రెండవ కారణం వెనకాల ఒక చిన్న కథ ఉంది.
ఖాండవ వన దహనం సమయము అప్పుడు అగ్నిహోత్రుడు కృష్ణార్జునలను ఆ వనాన్ని దహిస్తానున అని అడిగారట. ఒక మహారాజు పెద్ద యజ్ఞం చేశాడు అని అందులో నెయ్యి తాగి తాగి అజీర్ణం అయిందని బాగా ఆహారం కావాలి అని అగ్నిహోత్రుడు చెప్పారు. ఈ మాట విన్న కృష్ణార్జునులు ఆశ్చర్యపోయారు.అదేంటి అజీర్ణం అన్నారు కానీ మళ్ళీ ఆహారం కావాలి అంటున్నారు అని అగ్నిహోత్రుడి ని అడిగారు.
అజీర్ణం తగ్గాలంటే మందులు కావాలి మందులు కావాలి అంటే ముందు తయారు చేసుకోవాలి ఈ అడవిలో ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉన్నాయి కాబట్టి నేను ఈ అడవిని మొత్తం దహిస్తే నా అజీర్ణం తగ్గుతుంది అని చెప్పారు అగ్నిహోత్రుడు.ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయమని. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆగారు అని అగ్నిహోత్రుడిని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు ” ఇది ఖాండవ వనం. అంటే ఇది ఇంద్రుడి అరణ్యం. నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకే తినలేక పోతున్నాను” అని సమాధానమిచ్చారు.
ఈ మాట విన్న కృష్ణార్జునులు తినేయమని. ఇప్పటివరకు తినకుండా ఎందుకు ఆగారు అని అగ్నిహోత్రుడిని అడిగారు. ఆ ప్రశ్నకి అగ్నిహోత్రుడు ” ఇది ఖాండవ వనం. అంటే ఇది ఇంద్రుడి అరణ్యం. నేను ఈ వనాన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు. అందుకే తినలేక పోతున్నాను” అని సమాధానమిచ్చారు. అప్పుడు కృష్ణార్జునులు తాము కాపాడతామని చెప్పారు. అగ్నిదేవుడు చెప్పినట్టే తన ముట్టుకోగానే వర్షం మొదలైంది.అప్పుడు అర్జునుడు వర్షం వైపుకి బాణాలు వేశాడు. అలా తన బాణాల వర్షం తో వర్షాన్ని ఆపాడు. అప్పటినుండి అది వరంగా మారింది. పిడుగు కానీ వర్షం కానీ ఉరుములు కానీ వచ్చినప్పుడు అర్జున ఫాల్గుణ బీభత్స కృష్ణ కిరీటి విజయ పార్థ సవ్యసాచి ధనంజయ అన్న 10 నామాలు జపిస్తే ఉరుములు పిడుగులు ఆగుతాయని శాస్త్రం చెబుతోంది.