మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి అవి మనం అంతగా గమనించం.. తీర తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతాం.చేతి వేలి గోర్లపై కింది వైపుకు ఉండే భాగంలో అర్ధచంద్రాకారంలో నెలవంకను పోలిన ఓ ఆకారం ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించే ఉంటారు లెండి. కానీ దాని గురించి మీకు తెలిసి ఉండదు. కాగా ఆ ఆకారాన్ని ‘లునులా (Lunula)’ అని పిలుస్తారు.
ఈ లునులా మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్థం.ఈ లునులా దెబ్బతింటే గోరు పెరగడం ఆగిపోతుందట. గోరు రంగు.. లునులా తీరు ను బట్టి మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవచ్చట.
వేలి గోరుపై లునులా అసలు లేకపోతే వారు రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకోవాలి. ఒకవేళ లునులా రంగు నీలం లేదా పూర్తిగా తెలుపులో పాలి పోయి ఉంటే వారికి డయాబెటిస్ రాబోతుందని అర్థం చేసుకోవాలి.
లునులా మీద ఎరుపు రంగులో మచ్చలు ఉంటే వారికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని తెలుస్తుంది.లునులా ఆకారం మరీ చిన్నగా, గుర్తు పట్టలేనంతగా ఉంటే వారు అజీర్ణంతో బాధపడుతున్నారని, వారి శరీరంలో విష, వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయాయని తెలుసుకోవాలి.
చేతి గొర్ల గురించి మీకు తెలియని విషయాలు
- చేతి వేళ్లలో మధ్య వేలు గోరు మిగతా గోర్ల కన్నా వేగంగా పెరుగుతుంది.
- కాలి వేలి గోర్ల కన్నా చేతి వేళ్ల గోర్లే త్వరగా పెరుగుతాయి.