ఇప్పటికి ఎప్పటికి ప్రేమకు చిహ్నం గా తాజ్ మహల్ అని చెప్తూ ఉంటారు.అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఉరుములతో కూడిన వర్షం పడడం వలన తాజ్ మహల్ లో కొన్ని పిల్లర్లు ,గేట్ లు ,ప్రధాన స్మారక చిహ్నం మరియు కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి.వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

గత శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్ అంతటా కూడా భారీగా ఉరుములతో కూడిన వర్షం పడింది.దీనివలన తాజ్ మహల్ పడమర ద్వారం దగ్గర ఉండే చెక్కతో కూడిన టికెట్ కౌంటర్,ప్రధాన ద్వారం వైపు ఉండే తొమ్మిది అడుగుల పాలరాయి పిల్లర్,యమునా నది వైపుగా ఉండే ప్రధాన చిహ్నం మరియు తాజ్ మహల్ చుట్టూ ఉండే చాలా చెట్లు దెబ్బతిన్నాయి.ఆర్కియాలజీ సిస్టం అఫ్ ఇండియా ప్రధాన అధికారి వివి విద్యావతి తాజ్ మహల్ ను సందర్శించి నష్ట తీవ్రతను అంచనా వేశారు.అయితే తాజ్ మహల్ లో దెబ్బతిన్న చిహ్నాలను ,పిల్లర్లను మరియు తదితర వాటిని బాగుచెయ్యాలంటే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని వివి విద్యావతి వెల్లడించారు.

కాగా ఉత్తరప్రదేశ్ లో సంభవించిన ఈ ఉరుములతో కూడిన వర్షం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించగా పలు జంతువులు కూడా పెద్ద సంఖ్యలో మరణించాయి.ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.అయితే ఇప్పటికే ఈ ఘటనలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.