నాని కామెంట్స్ పై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.!

నాని కామెంట్స్ పై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.!

by Mohana Priya

Ads

సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరసు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి నాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ సినిమా థియేటర్లు తెరవకపోవడం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “సినిమా థియేటర్ల కంటే బార్స్, రెస్టారెంట్స్ చాలా ప్రమాదకరమని, ఎందుకంటే అక్కడ జనాలు మాస్క్ లు తీసేసి తింటారు అని, సినిమా థియేటర్లలో అయితే మాస్క్ పెట్టుకొని సినిమా చూస్తారు” అని అన్నారు.

Video Advertisement

talasani srinivas yadav responds on nani comments

అంతే కాకుండా ఎప్పుడైనా సినిమా థియేటర్లు తెరవకపోవడం వల్ల నష్టపోయే వాళ్లు అనే విషయంపై మాట్లాడినప్పుడు ఆ సినిమాలో నటించిన వాళ్లు, ఆ సినిమాకి పని చేసిన వాళ్ళు, అలాగే దర్శకులు, నిర్మాతల గురించి మాట్లాడతారు అని, కానీ ఆ థియేటర్లో, అలాగే ఆ థియేటర్ దగ్గరలో షాప్స్ పెట్టుకున్న వాళ్లు కూడా నష్టపోతున్నారు అని అన్నారు. అయితే ఈ విషయంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్పందించారు. ఆయన మాట్లాడుతూ “థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేసుకోమని చెప్పాం. ప్రొడ్యూసర్లు నిర్ణయం ఇది కానీ ప్రభుత్వం రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదు” అని అన్నారు.

watch video :


End of Article

You may also like