బిడ్డకు పాలివ్వడం వల్ల బిడ్డకే కాదు…తల్లి ఆరోగ్యానికి కూడా ఈ 8 లాభాలు ఉన్నాయంట.!

బిడ్డకు పాలివ్వడం వల్ల బిడ్డకే కాదు…తల్లి ఆరోగ్యానికి కూడా ఈ 8 లాభాలు ఉన్నాయంట.!

by Mohana Priya

Ads

ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్లు వరం గా భావించేది అమ్మతనం. అలాగే సృష్టిలో కూడా తల్లీ బిడ్డల అనుబంధానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది ఆడవాళ్ళని మీ జీవితంలో మీరు చాలా సంతోషంగా ఉన్న సందర్భం ఏంటి అంటే వాళ్ళు బిడ్డకు జన్మనిచ్చిన రోజు అని, తొమ్మిది నెలల పాటు తమలో ఉన్న ఒక ప్రాణం బయటికి వస్తే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం అని చెప్తారు.

Video Advertisement

చాలామంది తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ కి ఎక్కువ సుముఖత చూపరు. దానికి చాలా వ్యక్తిగత కారణాలు ఉంటాయి. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటంటే.

#1 పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు సరిపోయే న్యూట్రియెంట్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా లభిస్తాయట.

#2 పిల్లలు వైరస్, బ్యాక్టీరియా తట్టుకోగలిగే రోగనిరోధకశక్తి బ్రెస్ట్ మిల్క్ లో ఉంటుందట.

#3 పిల్లలకు ఎలర్జీలు, చైల్డ్ లుకేమియా, ఇన్ఫెక్షన్స్, జలుబు, శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయట.

#4 చిన్న వయసులోనే చాలామంది పిల్లలకి ఒబెసిటీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లలు హెల్తీ వెయిట్ ఉంటారట అంటే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారట.

#5 పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ శాతం కూడా పెరుగుతుందట.

#6 ప్రెగ్నెన్సీ తో బరువు పెరిగిన తల్లులు బరువు తగ్గుతారట.

#7 తల్లులు డిప్రెషన్ కి గురి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయట.

#8 తల్లుల్లో క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, ఆర్థరైటిస్, గుండెకి సంబంధించిన సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉంటాయట.


End of Article

You may also like