లాక్ డౌన్ వేళ తల్లిని చూసేందుకు సైకిల్ పై 16 రోజులు 1300 కిలోమీటర్లు!

లాక్ డౌన్ వేళ తల్లిని చూసేందుకు సైకిల్ పై 16 రోజులు 1300 కిలోమీటర్లు!

by Megha Varna

Ads

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే .భారత దేశంలో కూడా గత నెల రోజుల నుండి లాక్ డౌన్ అమలులో ఉంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని సామాజిక దూరం ప్రతీ ఒక్కరు పాటించాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపుని ఇచ్చాయి ..దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు .

Video Advertisement

అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ తో ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయారు ..దీంతో వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి పని చేసుకుంటున్న వలస కూలీలు తమ సొంత ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు ..లాక్ డౌన్ కారణంగా రోజుకో కధ వెలుగులోకి వచ్చి కన్నీరు పెట్టిస్తుంది.ఈ మధ్య కాలంలో సొంత ఊరు చేరేందుకు రవాణా మార్గాలు లేనందున నడుచుకుంటూ వెళ్లిన బాలిక మధ్యలో మృతి చెందిన విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలో ముంబై లో ఉంటున్న ఓ యువకుడు సైకిల్ పై తన స్వస్థలానికి చేరేందుకు 1300 కిలోమీటర్లు ప్రయాణించాడు..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం .

లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు తమ స్వస్థలానికి చేరుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు ..ఈ నేపథ్యంలో సంజయ్ రాంపాల్ స్వస్థలం హర్యానా లోని చార్కిడల్లో ఒంటరిగా తన తల్లితో నివాసం ఉంటున్నాడు .మూడు నెలల క్రితం సంజయ్ రామ్ పాల్ సినిమాలలో అవకాశం కోసం ముంబై వచ్చాడు.మొదటసారి లాక్ డౌన్ ఎత్తివేస్తారని ఇంటికి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాను కానీ లాక్ డౌన్ పొడిగించడంతో ఇంటికి వెళ్ళలేకపోయాను అని సంజయ్ రాంపాల్ తెలిపారు.

representative image

ఎలా  అయినా ముంబై నుండి హర్యానా కి వెళ్లి తన తల్లి ఈ లాక్ డౌన్ పరిస్థితులలో ఎలా నివసిస్తుందో చూడాలని నిశ్చయించుకున్నాను ..దాని కోసం ఓఎల్ఎక్స్ లో సైకిల్ తీసుకోని 1300 కిలోమీటర్లు ప్రయాణించి  నా తల్లి వద్దకు చేరుకున్నాను .రోజుకి ఎనభై నుండి తొంబై కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణిస్తూ 16 రోజులకు ఇంటికి చేరుకున్నానని సంజయ్ తెలిపారు .


End of Article

You may also like