తల్లితండ్రులు భార్యను వేధిస్తున్నారని…భార్యతో పాటు భర్త ఆత్మహత్య!

తల్లితండ్రులు భార్యను వేధిస్తున్నారని…భార్యతో పాటు భర్త ఆత్మహత్య!

by Megha Varna

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాసరే చాలామంది పోరాడుతూ జీవితంలో ముందుకు వెళ్తుంటారు.అయితే కొంతమంది మాత్రం ఎటువంటి కష్టం వచ్చిన చనిపోవడమే దానికి పరిష్కారం అని భవిస్తూ ఉంటారు.అయితే కుటుంబీకులు వేధిస్తున్నారని పురుగుల మందు తగి ప్రాణాలు తీసుకున్నారు ఓ భార్య భర్త.కాగా ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది..వివరాల్లోకి వెళ్తే ..

మెదక్ జిల్లా రామాయంపేట డి.ధర్మవరంలో విఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్న 29 ఏళ్ళ విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మరియు అతని భార్య ఐన 25 యేళ్ళ రుచిత అనే మహిళ కుటుంబీకులు వేధిస్తున్నారని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వీరు పురుగులు మందు తాగగానే సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు కానీ లాభం లేకపోయింది. వీరిది ప్రేమ వివాహం కాగా వీరికి 3 యేళ్ళ యువన్ రెడ్డి అనే కుమారుడు మరియు సంవత్సరం వయసు ఉన్న సాత్విక అనే కుమార్తె ఉన్నారు.ఇప్పుడు వీళ్లిద్దరు తల్లితండ్రి లేని పిల్లలుగా మిగిలిపోయారు.ఈ చిన్నారులను చూసి స్థానికులంతా విషాదంలో మునిగిపోయారు.అయితే గత కొంత కాలంగా విజయ్ కుమార్ తల్లి ,తండ్రి మరియు అతని సోదరి రుచిత ను సూటిపోటీ మాటలతో వేధింపులకు గురిచెయ్యడం వలనే విజయ్ కుమార్ మరియు రుచిత ఆత్మహత్య కు పాల్పడినట్లుగా తెలుస్తుంది.అయితే రుచిత తల్లితండ్రులు విజయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు నమోదు చేసారు.కాగా ఈ కేసు ను ఎసై మహేందర్ దర్యాప్తు చేస్తున్నారు.

You may also like