బోయపాటి-రామ్ సినిమాకు తమన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బోయపాటి-రామ్ సినిమాకు తమన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Megha Varna

Ads

ప్రస్తుతం ఎస్ ఎస్ థమన్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. థమన్ సంగీతం అందించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి. టాలీవుడ్ లో వరసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాడు థమన్.

Video Advertisement

ఇలా టాప్ సినిమాలతో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలకు కూడా పని చేస్తున్నాడు ఈ టాప్ సంగీత దర్శకుడు.

అలానే ఈ మధ్య వచ్చిన మెగా స్టార్ గాడ్ ఫాదర్ సినిమాకి కూడా తమన్ చక్కటి సంగీతాన్ని ఇచ్చాడు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి మంచి ఫేమ్ వచ్చింది. నిజానికి మ్యూజిక్ తో ఒక మాయ చేసాడు తమన్.

పైగా ఆయనకు ఒక సెంటిమెంట్ కూడా ఉందట. మొదటిసారి ఏ హీరోతో అయితే సినిమా చేస్తారో ఆ హీరోకి ఖచ్చితంగా మంచి హిట్ ని ఇస్తారట. తొలిసారి పని చేసిన హీరోలందరి సినిమాలు కూడా హిట్ అయ్యాయని తమన్ అంటున్నాడు.

ఇది ఇలా ఉంటే తమన్ ఇప్పుడు బోయపాటి సినిమాకు మ్యూజిక్ ఇవ్వనునందు. అయితే ఈ సినిమాకు పవర్ ఫుల్ మ్యూజిక్ ని తమన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఎంత రెమ్యునరేషన్ ని తమన్ తీసుకుంటున్నాడనేది చూస్తే.. ఐదు కోట్ల రూపాయలను ఈ సినిమాకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేష్ త్రివిక్రమ్ సినిమాకు కూడా ఈ రేంజ్ లో తమన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిజంగా తమన్ ఈ సినిమాలకు ఇంత తీసుకున్నాడా అనే దాని గురించి పక్కాగా తెలీదు టాక్ మాత్రం నడుస్తోంది. నిజమా కాదా అనేది తెలియాల్సి వుంది.

 


End of Article

You may also like