“తమన్” సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయిందా..? ఇప్పుడు గాడ్ ఫాదర్… అప్పుడు..?

“తమన్” సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయిందా..? ఇప్పుడు గాడ్ ఫాదర్… అప్పుడు..?

by Megha Varna

Ads

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు.

Video Advertisement

దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్.

god-father-ott-release-update

కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు. ఆ మార్పులు కూడా చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు నచ్చాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ చాలా బాగుంది అని అంటున్నారు. అలానే ఈ సినిమాలో బీజీఎమ్ కూడా చాలా బాగుందంటూ అందరు మెచ్చుకుంటున్నారు. దీనితో తమన్ సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్ అయ్యింది. ఇంతకు ముందు లాగే ఇప్పుడు కూడా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు.

అసలేం అయ్యింది అనేది చూస్తే.. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాకి తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిజానికి మ్యూజిక్ తో ఒక మాయ చేశారు తమన్. పైగా ఆయనకు ఒక సెంటిమెంట్ కూడా ఉందట. మొదటిసారి ఏ హీరోతో అయితే సినిమా చేస్తారో ఆ హీరోకి ఖచ్చితంగా మంచి హిట్ ని ఇస్తారట. తొలిసారి పని చేసిన హీరోలందరి సినిమాలు కూడా హిట్ అయ్యాయని… తమన్ అంటున్నారు.

పైగా మెగాస్టార్ చిరంజీవి అంటే అతనికి చాలా ఇష్టమట. తమన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఓసారి కోటి గారి రికార్డింగ్ స్టూడియో కి వెళ్లారట ఆ సమయంలో ‘అందం హిందూలం’ పాట రికార్డింగ్ అవుతోందట. ఆ పాట విన్నప్పటి నుండి చిరంజీవికి అభిమాని అయిపోయారు తమన్. అయితే మొదటి సారి తమన్ ఏ హీరోతో పని చేస్తారో ఆ సినిమా హిట్ అవుతుందని మరోసారి మెగాస్టార్ గాడ్ ఫాదర్ హిట్ అయిన తర్వాత రుజువయింది.


End of Article

You may also like