మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది అన్నారు… డాక్టర్ మాట్లాడడంతో..? ఈ మహిళ గురించి వింటే కన్నీళ్లు ఆగవు..!

మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది అన్నారు… డాక్టర్ మాట్లాడడంతో..? ఈ మహిళ గురించి వింటే కన్నీళ్లు ఆగవు..!

by kavitha

Ads

సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వల్ల మూడు సంవత్సరాల క్రితం తప్పి పోయిన ఒక మహిళ తన కుటుంబాన్ని చేరుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని పుదుక్కోట్టై గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

రాజస్థాన్‌కు చెందిన 24 ఏళ్ళ మెడికల్ స్టూడెంట్ ప్రమీలా బిష్ణోయ్ పుదుక్కోట్టైలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్  చదువుకుంటోంది. ప్రమీలా ట్రైనింగ్‌లో భాగంగా సెప్టెంబరు 27న మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న  45 ఏళ్ళ మహిళను పుదుక్కోట్టై ఆసుపత్రిలో కలిసింది.
మానసిక చికిత్స పొందుతున్న ఆ మహిళతో సాన్నిహిత్యం ఏర్పడడంతో ప్రమీల ఆమె గురించి అడిగింది. అప్పుడు సదరు మహిళ తాను మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినట్టుగా, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపింది.  మూడు సంవత్సరాల క్రితం తాను ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలులో ఎక్కానని చెప్పారు. ఆమెకు తన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి వివరాలు కూడా లేకపోవడంతో పుదుక్కోట్టైలో చిక్కుకుపోయానని ఆ మహిళ చెప్పింది.
వివరాలు తెలుసుకున్న ఆ మెడికల్ స్టూడెంట్ ఆ మహికు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ మహిళ ఫొటోను మరియు వివరాలను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఆ మహిళ పేషెంట్ స్నేహితురాలికి ఆ పోస్ట్ కనిపించింది. స్నేహితురాలు వెంటనే వీడియో కాల్ చేసి మహిళతో మాట్లాడింది. గత శుక్రవారం ఆ మహిళను ఆమె భర్తతో మాట్లాడించారు.
వీడియో కాల్ తర్వాత, మహిళ కుటుంబం తరువాతి రోజు శనివారం ఆమెను కలవడానికి  పుదుక్కోట్టైకి వచ్చింది. ఆ మహిళ తప్పిపోయినపుడు ఆమె కుటుంబసభ్యులు లోకల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. కానీ ఆ మహిళ ఆచూకీ దొరకలేదు. దాంతో ఆమె మరణించి ఉంటుందని అనుకున్నారు. మానసిక చికిత్స వల్ల మహిళ పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆమెకు తన వివరాలు గుర్తుకు వచ్చాయి. ఒక్క పోస్ట్ వల్ల మూడు సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకుంది.

Also Read: తండ్రినే అమ్మకానికి పెట్టిన కూతురు..! కారణం చూస్తే షాక్ అవ్వాల్సిందే..?


End of Article

You may also like