Ads
లంచాలు ప్రాణాలు తీస్తుంది.ఈ విషయం మనం సినిమాలలో చూస్తుంటాం కదా తాజాగా ఇలాంటి ఓ ఘటన ఉత్తర్ ప్రదేశ్ దేవరియా జిల్లా ప్రాంతంలో చోటు చేసుకుంది.అయితే ప్రాణాలు పోయేంత ప్రమాదం జరగకపోయినా అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం అంతటి ప్రమాదం జరిగే సూచనలకు ప్రస్తుతం కాకపోయినా రానున్న కాలంలో అంతటి దారుణానికి దారి తీసేలా ఉంది.
Video Advertisement
వివరాలలోకి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బర్హజ్ ప్రాంతంలోని గౌరా గ్రామానికి చెందిన చెడీ యాదవ్ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు వెంటనే అతన్ని కూతురు,మనమడు దేవరియా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడి డాక్టర్లు సూచన మేర అతడిని సర్జికల్ వార్డుకు తరలించమని చెప్పారు.ఈ విషయాన్ని చెడీ యాదవ్ కూతురు వార్డ్ బాయ్ కి చెప్పింది.వార్డ్ బాయ్ అతన్ని వార్డ్ తరలించడానికి 30 రూపాయిలు లంచం అడిగాడు.
అసలే కరోనా దెబ్బ ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం ఆ డబ్బులు ఇవ్వలేక చెడీ యాదవ్ కూతురు తన కొడుకు సహాయంతో చెడ్డి యాదవ్ స్ట్రక్చర్ ను వార్డ్ కు తరలించింది.ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక వ్యక్తి మొత్తం చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.వీడియో చూసినవారంతా ఆ వార్డ్ బాయ్ పై ఆ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
End of Article