ఈమధ్య కాలంలో తంగడపల్లి లో ఓ వివాహిత మృతదేహం నగ్నంగా దొరికింది ..ఇంతకీ ఎవరు ఆ వివాహిత ఎం జరిగింది వివరాలలోకి వెళ్తే …ఈ కేసుకు సంబంధించి నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి . ఇద్దరు యువకులు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలిసుల విచారణలో తేలింది . పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆలోచనతోనే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలిసుల ప్రాథమిక విచారణలో తేలింది .ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా రెండో యువకుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు ..

Video Advertisement

పోలిసుల కధనం ప్రకారం ..హత్యకు గురైన మహిళా కు వివాహం అయింది ..కాగా పెళ్ళికి ముందు నుండే  ప్రధాన నిందితుడితో ప్రేమలో వుంది ..పెళ్లి తర్వాత కూడా వారి సంబంధం కొనసాగగా మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెడదామని పదేపదే ఒత్తిడి తీసుకు వచ్చేది …..అయితే ఆ యువకుడు వేరే అమ్మాయితో ప్రేమలో ఉండగా ఈ వివాహితను దూరం పెట్టసాగాడు . అయినప్పటికి ఆమె నుండి ఒత్తిడి ఎక్కువవడంతో హత్య చేసి వదిలించుకోవాలని ప్లాన్ చేసాడు ..

ముందుగా అనుకున్న పథకం ప్రకారం లాంగ్ డ్రైవ్  కి వెళ్దామని బాధితురాలిని నమ్మించి అద్దె కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత పోలీసుల అదుపులో ఉన్న నిందితుడితో కలిసి మొదటగా అత్యాచారం చేసి తర్వాత గొంతు నొక్కి హతమార్చాడు .తర్వాత తంగడపల్లి వంతెన దగ్గరకు చేరుకొని మృత దేహంపై దుస్తులు తొలగించి మొఖం ఎవరు గుర్తుపట్టకుండా బండరాయితో  పచ్చడి చేసారు ..ఆ తర్వాత మృతదేహాన్ని కిందకి త్రోసివేసి బండరాయి ని తమతోపటు తీసుకువెళ్లారు ..

ఎక్నెపల్లి ,ప్రగతి రిసార్ట్స్ ,ప్రొద్దుటూరు మీదగా నారసంగి ఇంటర్ చేంజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదకు చేరుకున్నారు ..ఈ విషయాలన్నీ  పట్టుబడిన రెండో నిందితుడి నుండి పోలీసులు తెలుసుకున్నారు .ప్రొద్దుటూరు వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు ఇంట్రాగేషన్ ముమ్మరం చేసారు .ఈ కేసులో కార్ జిపీఎస్ ముఖ్యంగా మారింది .పారిరిలో ఉన్న నిందితుడు దొరికితే మరిన్ని విషయాలు తెలిసి కేసు పూర్తి అవుతుంది అని సదురు కేసును దర్యాప్తు చేస్తున్న సిఐ అన్నారు ..

Note: Images used are just for representative purpose but not the actual characters.