114 కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి … ట్యాంక్ బండ్ శివ గురించి తెలిస్తే హాట్సాప్ అంటారు .(వీడియో )

114 కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి … ట్యాంక్ బండ్ శివ గురించి తెలిస్తే హాట్సాప్ అంటారు .(వీడియో )

by Mohana Priya

హుస్సేన్ సాగర్ హైదరాబాద్ లో ఫేమస్ ప్రదేశాల్లో ఒకటి. ఈ విషయం తెలియని వారు ఉండరు. హుస్సేన్ సాగర్ చూడడానికి బాగున్నా కూడా వాసన మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. మనం వాసన పీల్చడానికే ఇబ్బంది పడే హుస్సేన్ సాగర్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఆత్మహత్యాయత్నం చేసి అందులో దూకిన వారిని బతికుంటే కాపాడుతూ, చనిపోయిన వారిని బయటకి తీస్తున్నారు శివ. శివ కంటే ట్యాంక్ బండ్ శివ అంటే అందరికీ స్ట్రైక్ అవుతారు. ఆ ప్రాంతంలో శివ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. అందరికీ అంత సుపరిచితులు శివ.

Video Advertisement

అసలు మామూలుగా అలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా అన్ని ఓర్చుకుని మనుషుల్ని బయటికి తీయడమే పెద్ద సాహసం.ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్యకు యత్నించిన 114 మందిని ఈయన కాపాడారు శివ.ఇలా చాలామందికి ప్రాణదాతగా నిలిచిన శివ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తు రోడ్డుపై కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.

శివ ఒక అడుగు ముందుకు వేసి కరోనా ఉన్న ఒక మనిషిని బయటికి తీశారట. అందరు తను చేసే పని వేరే ఉంది అని, తొందర పడొద్దు అని, తనకే కాకుండా తన ఇంటి సభ్యులకి కూడా ప్రమాదం అని చెప్పారు.కానీ శివ ధైర్యం చేసి చనిపోయిన వ్యక్తి ని బయటికి తీశారు. ఆ వ్యక్తి హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకొని, కరోనా పాజిటివ్ ఉంది అని తెలిసిన తర్వాత ట్యాంక్ బండ్ మీద కి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు.తనతో పాటు వచ్చిన వ్యక్తి పరిగెత్తుకుంటూ రావడం కానిస్టేబుల్ చూశారు, శివ కూడా చూసి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. 24 గంటలు నీటిలో ఉన్న చనిపోయిన వ్యక్తి శరీరాన్ని జాగ్రత్తగా వెతికి తీశారు శివ. ముందు జిహెచ్ఎంసి వాళ్లకి ఈ విషయం చెప్తే కేవలం బయట ఉన్న మృతదేహాలను మాత్రమే తీసుకు వెళ్తాము అని చెప్పారు. శివ తో ఉన్న కానిస్టేబుల్ జిహెచ్ఎంసి వాళ్లతో “మేము కష్టపడి బయటికి తీస్తే, మీరు తీసుకొని వెళ్లి పోవడం ఏంటి?” అని అన్నారు.దాంతో అక్కడికి వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళ పిపిఈ కిట్ లని అక్కడ పడేసి వెళ్ళిపోతే, శివ ఆ కిట్ ధరించి చనిపోయిన వ్యక్తి ని బయటికి తీసి, దహన సంస్కారాలు జరిపించారు. ఈ విషయాన్ని శివ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

watch video :


You may also like