దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు యువకుడు విజయ్ అతని వయసు 24 సంవత్సరాలు. హఠాత్తుగా ఇండియాకి బయలుదేరి మధురై ఎయిర్ పోర్టులో దిగాడు. దిగీదిగగానే ఎనిమిది మంది పోలిసులతో కలిసిన బృందం అడ్డుకొని బుధవారం ఐసొలేషన్ వార్డుకు పంపారు ..కాగా అతని గర్ల్ ఫ్రెండ్ అక్కడకి అతి చేరువలో వున్నా శివగంగ అనే గ్రామంలో ఉండగా తనను కలిసేందుకు చాకచక్యంగా ఐసొలేషన్ నుండి తప్పించుకున్నాడు ..పోలీసులు అంతకంటే చాకచక్యంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేసి పట్టుకున్నారు.

Video Advertisement

స్థానికులను ఆరతియ్యగా వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారమని అందునా అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోలేదని దాంతో యువతీ దుబాయ్ లో వున్నా విజయ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ..ఇద్దరు ఒకచోట రహస్యంగా కలుద్దామని తదుపరి అటు నుండి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు … ఐసొలేషన్ నుంచి అకస్మాత్తుగా కనిపించకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు .

 

విజయ్ …..తన లవర్ నుండి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఫోన్ స్విచ్-ఆఫ్ చెయ్యకుండా ఉంచాడు ….దీనితో పోలీసులకి విజయ్ ఫోన్ ట్రాక్ చేసి తాను వున్నా ప్రదేశాన్ని గుర్తించడం సులభం అయింది …యువతీ తల్లితండ్రులు విజయ్ తో ప్రేమ వ్యవహారానికి ఒప్పుకోకుండా వేరే వివాహం చేసేందుకు సిద్దపడడంతో విరిద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు.