కరోనా నుంచి తప్పించుకోవడానికి ఈ జంట వింతగా ఏం చేసారో చూడండి (వీడియో )

కరోనా నుంచి తప్పించుకోవడానికి ఈ జంట వింతగా ఏం చేసారో చూడండి (వీడియో )

by Megha Varna

Ads

కొవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావం ఇంకా తగ్గినట్లు కన్పించట్లేదు. ఈ వైరస్‌ కారణంగా చైనాలో మరో 150 మంది బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 2592కు పెరిగింది. . చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇతర దేశాలకు పాకింది. ఆయా దేశాల్లో కూడా మరణాలు సంభవించాయి. దీంతో…ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి చైనా దేశస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.కరోనా వైరస్‌కు అత్యంత ప్రభావితమైన హుబేలో మరణాల రేటు 2.9% ఉండగా, ఇది మిగిలిన దేశం మొత్తం మీద 0.4% ఉంది.మంగళవారం నాటి ప్రభుత్వ వివరాల ప్రకారం ఇప్పటివరకూ 2592 మంది మరణించగా, 72,436 మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.సోమవారం నాడు 98 మంది చనిపోగా, 1886 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 93 మరణాలు, 1807 కేసులు హుబేలోనే నమోదయ్యాయి.

Video Advertisement

ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి చైనా దేశస్తులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.కొంతమంది మాస్క్ లు ధరిస్తుంటే..మరికొంత మంది శరీరం కనిపించకుండా..తెల్లటి వస్త్రాలు ధరిస్తున్నారు. చివరకు జంతువులకు కూడా మాస్క్ లు వేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియాలో  ఒక విమానంలో ప్రయాణించిన ఇద్దరు కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు చేసిన విచిత్రమైన పని ప్రసుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇద్దరు తమ శరీరాలను పూర్తిగా ప్లాస్టిక్‌ అవుట్‌ఫిట్‌ తొడుక్కున్నారు. అందులో ఒక మహిళ పింక్‌ కలర్‌లో ఉన్న ప్లాస్టిక్‌ అవుట్‌ ఫిట్‌ను ధరించి నిద్రపోతుండగా, మరొక వ్యక్తి వైట్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌ను ధరించాడు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ వారు వేసుకున్న అవుట్‌ ఫిట్లకు చిన్నపాటి రంధ్రం కూడా లేకపోవడంతో ఊపిరి తీసుకోవడానికి కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. కరోనా వైరస్‌ రాకుండా వారు తీసుకున్ననిర్ణయం మంచిదే.. కానీ మరి ఊపిరి తీసుకోవడానికే ఇబ్బందిగా ఉన్న ప్లాస్టిక్‌ అవుట్‌ ఫిట్లను ధరిస్తే అసలుకే మోసం వస్తుందని నెటిజన్లు ​కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి


End of Article

You may also like