బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన తాప్సి…ఇంతకీ అతనెవరు?

బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన తాప్సి…ఇంతకీ అతనెవరు?

by Megha Varna

Ads

కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి, తర్వాత బాలీవుడ్ షిప్ట్ అయిపోయింది. బాలీవుడ్లో విభిన్న చిత్ర కథలను ఎంచుకుంటూ, వాటిల్లో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ , బాలీవుడ్లోనే కాదు ,దేశవ్యాప్తంగా  ఫ్యాన్స్ ని సంపాదించుకోగలిగింది. ఆ అభిమానానికి ప్రధాన కారణాలు  తాప్సి నటించే చిత్రాలు, వాటిల్లోని కథాంశాలే . ఫింక్, తప్పడ్ ఇతర చిత్రాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసాయి.వైవిద్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న  తాప్సి తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకొంది..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

 

ఇటీవల  ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాప్సి పన్ను మాట్లాడుతూ ..అందరికి నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటంవలన పలు రకాల కధనాలు ప్రచారం లోకి తీసుకువస్తున్నారు,నేను ఇంకా వివాహం చేసుకోలేదు.నా జీవితంలోకి వస్తున్నా వ్యక్తి సినిమా రంగానికో క్రికెట్ రంగానికో సంబందించి వ్యక్తి కాదు .అసలు ఈ దగ్గరలో ఉన్న వ్యక్తి అయితే కానే కాదు అని తెలిపారు.నేను ప్రేమిస్తున్న వ్యక్తి బాడ్మింటన్ ఆటగాడైన మథియాస్ బోతో అని తాప్సి వెల్లడించారు .నా తల్లితండ్రులు ఒప్పుకున్నారు కాబట్టే ఈ విషయాన్నీ బహిర్గతం చేస్తున్నాను.

ఈ నేపథ్యంలో తాప్సి తన వివాహం గురించి మాట్లాడుతూ నేను ఎప్పుడైతే పిల్లలు కావాలి అని కోరుకుంటానో అప్పుడు మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని తెలిపారు.నేను బాగా హడావిడి చేసుకునేలా పెళ్లి చేసుకోను ..చాలా సాదాసీదాగా నా దగ్గర స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటాను అని వెల్లడించారు.


End of Article

You may also like