కుక్కకి సన్మానం చేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా..? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

కుక్కకి సన్మానం చేస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా..? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Harika

Ads

ఎంతో మంది తమ పెంపుడు జంతువులని ఇంట్లో వారి లాగానే చూసుకుంటూ ఉంటారు. వారిని తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ, మనుషులకి ఎలాంటి ఆహారం పెట్టడం, వారిని ఎలా జాగ్రత్తగా తీసుకోవడం చేస్తూ ఉంటారో, పెంపుడు జంతువులతో కూడా అలాగే చేస్తూ ఉంటారు. చాలా మంది కుక్కలు అంటే మనుషులతో సమానంగా పెంచుకుంటూ ఉంటారు. కుక్కలకి కూడా మనుషుల లాగానే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అవి చేసే పనులను కూడా గుర్తిస్తూ ఉంటారు. ఈ ఫోటోలో ఒక కుక్కకి సన్మానం చేస్తున్నారు. ఈ ఫోటో చూడటానికి అందరికీ వింతగా అనిపిస్తుంది.

Video Advertisement

tara adilabad police dog

కానీ దీని వెనుక ఒక కథ ఉంది. ఈ ఫోటోలో సన్మానం చేయించుకుంటున్న కుక్క పేరు తార. తార ఆదిలాబాద్ డాగ్ స్క్వాడ్ లో పని చేస్తుంది. 11 సంవత్సరాల పాటు తన సేవలను అందించింది. పేలుడు పదార్థాలని తార పసిగట్టేది. అలా 11 సంవత్సరాలు అదిలాబాద్ డాగ్ స్క్వాడ్ లో పనిచేశాక తార ఇప్పుడు రిటైర్ అవుతోంది. అందుకే తార సేవని గుర్తించి పోలీసులు తారని సన్మానించారు. పోలీసులు ఈ విషయం మీద మాట్లాడుతూ తార పోలీస్ వ్యవస్థకి తన ఉన్నతమైన సేవలు అందించింది అని చెప్పారు. ఈ సన్మాన వేడుకలో పోలీసులతో పాటు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

తార చేసిన సేవలను గుర్తించి సన్మానం చేయడం అనేది చాలా మంచి విషయం అంటూ చాలా మంది అభినందిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియా అంతా కూడా తెలియడంతో అందరూ తారని సన్మానించి చాలా గొప్ప పని చేశారు అని అంటున్నారు. రిటైర్ అయ్యే ముందు సాధారణంగా తమ ఆర్గనైజేషన్ కి సేవలు అందించిన వారికి గుర్తింపుగా ఏదో ఒక రకంగా వాళ్ళకి గుర్తుండిపోయే విధంగా ఏదైనా చేస్తాం. ఇప్పుడు తార చేసిన పనికి గుర్తింపుగా కూడా పోలీసులు ఇలా చేశారు. 11 సంవత్సరాలు తార పోలీస్ వ్యవస్థకు చేసిన సేవను గుర్తించి ఈ విధంగా తారని సన్మానించారు.

watch video :


End of Article

You may also like