Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది.
Video Advertisement
కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి. కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు.
అయితే ఇవాళ ఇదే విధంగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా హిందీ విడుదల అయ్యింది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమాకి కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. చాలామంది తెలుగు సినిమా లాగానే హిందీలో కూడా చాలా బాగా తీశారు అని అన్నారు. అంతే కాకుండా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కి థియేటర్ లో స్టాండింగ్ పొజిషన్ ఇచ్చారు.
కానీ ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ గా రాశారు. సినిమా చాలా యావరేజ్ గా ఉంది అని, షాహిద్ కపూర్ బాగా చేశారు అని, కొన్ని చోట్ల మాత్రమే సినిమా బాగుంది అని, చాలా స్లోగా ఉంది అని, సినిమా నెరేషన్ చాలా సాగదీశారు అని, చాలా క్రికెట్ ఉంది అని రాశారు. దాంతో చాలామంది ఈ రివ్యూపై కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ కి సంబంధించిన సినిమాలో క్రికెట్ కాకుండా ఏముంటుంది అని అంటున్నారు.
End of Article